AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?

Phani CH
|

Updated on: Sep 04, 2025 | 6:09 PM

Share

గ్రహాంతరవాసులు భూమిపైకి దూసుకొస్తున్నారా..? అత్యంత వేగంతో వస్తున్న ఏలియన్స్‌ నౌక భూమిని ఢీకొట్టబోతుందా..? బాబా వంగా చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే రహస్య వస్తువేదో నవంబర్‌లో భూమిని ఢీకొట్టబోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మాన్‌హట్టన్ పరిమాణంలో ఉన్న ఒక వస్తువు మన సౌర వ్యవస్థ గుండా వెళ్తుండటం చూసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 3I/ATLAS అని పిలువబడే ఈ వస్తువు గ్రహాంతర జీవుల నౌక కావచ్చని, అకస్మాత్తుగా భూమిపై దాడి చేయగలదనే అనుమానాలు వెలుబుచ్చారు. గ్ర‌హాంత‌ర‌వాసులు ఈ పేరు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై వ‌చ్చిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే క‌థ‌ల్లోనే ఉన్న ఈ గ్ర‌హాంత‌ర వాసులు ఇప్పుడు నిజంగానే మ‌న‌ల్ని ప‌ల‌క‌రించేందుకు వ‌స్తున్నారా.? అంటే అవున‌నే అంటున్నారు ప‌రిశోధ‌కులు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇదోదే సాధార‌ణ గ్ర‌హ‌శ‌క‌లం లాంటి వ‌స్తువ‌ని అంతా భావించారు. కానీ భూమివైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సెకండుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు. నిజానికి అంతరిక్షం నుంచి ఇలాంటి ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాలు భూమివైపు వ‌స్తుంటాయి. అయితే భూ వాతావ‌ర‌ణంలోకి రాగానే ద‌గ్ధమైపోతాయి. కానీ ప్ర‌స్తుతం వ‌స్తున్న వ‌స్తువు గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 3ఐ/అట్లాస్‌ భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు. ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బాబా వంగా గతంలో చెప్పిన జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2025లో భూమిపై గ్రహాంతర వాసులు దాడి చేయొచ్చని బాబా వంగా జోస్యం చెప్పారు. గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు. ఈ ఏడాదిలోనే మానవులకు, గ్రహాంతర వాసులకు మధ్య పరిచయం ఏర్పుడుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్‌ వైరల్‌

దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్‌.. త్వరలోనే పెళ్లి

వినాయకుడికి నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు! కేజీ ఎంతో తెలుసా?