ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 20వ వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ పాముతో నిరసన తెలిపారు. తమ వార్డులో పిచ్చిమొక్కలు పెరిగి పాముల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది వార్డు ప్రజల సమస్యల తీవ్రతను తెలుపుతుంది.
సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు ఖాళీ బిందెలతోనో, ప్లేకార్డులతోనో నిరసన తెలపడం చూస్తుంటాం. కానీ నిడదవోలు మున్సిపాలిటీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తమ వార్డులో పాముల భయం ఏ స్థాయిలో ఉందో వివరించడానికి ఓ కౌన్సిలర్ ఏకంగా పాముతో కౌన్సిల్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిడదవోలు 20వ వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్, శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును బంధించి తీసుకువచ్చారు. తాను మీటింగ్‌కు వస్తుండగా దారిలో ఉన్న ఒక పాఠశాల వద్ద పిల్లల మీదకు ఈ పాము వచ్చిందని, ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికే ఇలా చేశానని ఆయన తెలిపారు. తమ వార్డులో పిచ్చిమొక్కలు పెరిగిపోయి పాముల బెడద తీవ్రంగా ఉందని, ఫోటోలు పంపినా ఎవరూ పట్టించుకోలేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బాలో పామును చూసిన మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పామును బయట వదిలేసి రావాలని గట్టిగా ఆదేశించడంతో ఛైర్మన్ కు, అనిల్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయని అనిల్ నిలదీశారు. ఒక్కో పామును పట్టించడానికి రూ. 2 వేల నుండి 3 వేల వరకు ఖర్చవుతోందని, సామాన్యులు ఆ భారాన్ని మోయలేకపోతున్నారని వాపోయారు. చివరకు సభ్యుల కోరిక మేరకు పామును బయట ఉంచి వచ్చి, అనిల్ తన వాదన వినిపించారు. అయితే పాముతో సభలోకి రావడంపై కూటమి సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, సమస్యను హైలైట్ చేయడానికి కౌన్సిలర్ ఎంచుకున్న ఈ ‘స్నేక్ నిరసన’ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..
Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..
రీల్ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్ నోటీసులు..
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

