AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ

కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ

Phani CH
|

Updated on: Sep 05, 2025 | 7:18 PM

Share

టెలివిజన్ ప్రపంచంలో కపిల్ శర్మ షోకు ఉన్న క్రేజ్ వేరు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా కపిల్ శర్మ షోకు క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ప్రతి వీకెండ్ సాయంత్రం ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురుచూస్తారంటే ఆశ్చర్యం లేదు. కామెడీ, బోల్డ్ పంచ్ డైలాగ్స్, సడన్ సర్‌ప్రైజ్ ఎంట్రీలు, స్టార్ సెలెబ్రిటీల ప్రమోషన్లు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ షో.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగానూ మారింది.

అందుకే షో.. టీఆర్పీ రేటింగ్స్ ఎప్పుడూ టాప్ 5లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ షోలో ఒక పెద్ద మార్పు జరగబోతోందన్న వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ కనిపిస్తోంది. కపిల్ శర్మ షోకు అనేక మంది కమెడియన్లు వచ్చి వెళ్లారు. కానీ కొందరు మాత్రం ఫ్యాన్స్ మనసులో బలంగా నాటుకుపోయాయి. అలాంటి వారిలో కికు శారదా ఒకరు. ఆయన సీరియస్ లుక్‌లోనూ, ఫన్నీ లుక్‌లోనూ చేసిన స్కిట్స్‌కి మంచి ఆదరణ లభించింది. కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్‌తో కాంబినేషన్ స్కెచెస్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు కపిల్ షోకు దూరం అవుతుండటమే హాట్ టాపిక్‌గా మారింది. ఒక కొత్త ప్రాజెక్ట్ కారణంగా కికు ఈ షో కు బ్రేక్ ఇచ్చారు. కికు ఇప్పుడు “రైజ్ అండ్ ఫాల్” అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఈ షో సెప్టెంబర్ 6న అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమ్ కానుంది.బిగ్ బాస్ తరహాలో రూపొందించిన ఈ షోలో వ్యూహాలు, వినోదం, డ్రామా అన్నీ మిక్స్ అవుతాయి. దీనికి అశ్నీర్ గ్రోవర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోలో కికు శార్ధాతో పాటు అర్జున్ బిజ్లాని, ధనశ్రీ వర్మ, కుబ్రా సైట్, అర్బాజ్ పటేల్, ఆరుష్ భోలా, జార్జియా ఆండ్రియాని కూడా పాల్గొంటున్నారు. కాగా, కికు కేవలం చిన్న బ్రేక్ తీసుకున్నాడే తప్ప.. శాశ్వతంగా కపిల్ షో నుంచి వెళ్లిపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో.. కికు లేని లోటును ఎవరు భర్తీ చేస్తారనే డిస్కషన్ మొదలైంది. డబుల్ మీనింగ్ లేకుండా కికు చేసే ఫన్నీ స్కిట్స్ కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవని,ముఖ్యంగా… సునీల్ గ్రోవర్‌తో కలిసి చేసిన స్కిట్స్ మరిచి పోలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు. కికు లేని కపిల్ షో‌లో కిక్ ఉండదని అటు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని

Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!

New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే

హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు షురూ

Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?