అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నానమ్మ, తాతయ్య, ముత్తమ్మల దగ్గర నుంచి పిన్ని, బాబాయి, అత్త, మామ సహా అనేక మంది ఇంట్లో ఉండేవాళ్లు. వీరంతా పిల్లలను చూసుకుంటూ ప్రేమను పంచేవాళ్లు. కాలం మారింది. కన్నవాళ్లను వృద్ధాశ్రమాల్లో పడేస్తూ.. తమకు పుట్టిన వాళ్లను మాత్రమే తమతో ఉంచుకుంటూ జీవిస్తున్నారు. ఫలితంగా చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి.
ఈ ఇళ్లల్లో భార్యాభర్తలు వారి పిల్లలు తప్ప మరెవరూ ఉండట్లేదు. ఒక్కరే సంతానం ఉన్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోగా.. ఫలితంగా చిన్నారుల్లో ఒంటరితనం ఏర్పడుతోంది. అమ్మా, నాన్నలు తమ పనుల్లో బిజీగా ఉండి ఆ ఉన్న ఒక్కరిని కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. మరోవైపు వృద్ధాశ్రమల్లో ఉంటున్న వాళ్లు కూడా మనవళ్లు, మనవరాళ్లకు దూరమయ్యామని బాధ పడుతున్నారు. ఎప్పుడూ వారినే తలుచుకుంటూ నరకం చూస్తున్నారు. ఈ సమస్యలు అన్నీ అర్థం చేసుకున్న ఓ వృద్ధాశ్రమం ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది. ముఖ్యంగా అద్దెకు వృద్ధులను ఇస్తూ.. ఇటు పెద్దల్లో, అటు పిల్లల్లో ఒంటరితనాన్ని పోగొట్టాలని ప్లాన్ చేస్తోంది. వృద్ధులను అద్దెకు ఇచ్చే జపాన్ కాన్సెప్ట్ స్ఫూర్తితో దేశంలో మొదటిసారి ఆగ్రా నగరంలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక కుటుంబం అద్దెకు వృద్ధులను తీసుకెళ్లి నెల రోజులు తమింట్లో ఉంచుకోవచ్చు.. ముందుగా రూ. 11 వేలు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తంలో కొంత భాగం వృద్ధులకు వ్యక్తిగత ఖర్చుల కోసం అందజేస్తారు. మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమం నిర్వహణ కోసం వినియోగిస్తారు. అయితే ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీన్ని మానవ సంబంధాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం అని విమర్శిస్తుండగా.. మరికొందరు దీనిని ఒక సామాజిక సేవగా అభివర్ణిస్తున్నారు. కుటుంబం లేని వృద్ధులకు ఇది ఒక కొత్త జీవితాన్ని ఇస్తుందని, అనాథలుగా బతికే బదులు ఒక కుటుంబంలో ఆనందంగా ఉండవచ్చని ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Heavy Floods: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు
స్కూలుపై దావా వేసిన దొంగ.. నెలకి లక్షన్నర కట్టాలన్న కోర్టు
Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

