అప్పు చేయనేలా.. ఇప్పుడు వైరల్ అవ్వడమేలా! స్టార్ కపుల్‌కు బిగ్ షాక్!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థిక, వ్యాపారా లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులుపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు కూడా వెళ్లొచ్చాడు రాజ్ కుంద్రా. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది.
లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్దం క్రితం రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తన నుంచి రూ.60 కోట్లు తీసుకున్నారని దీపక్ పేర్కొన్నారు. ఈ డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటామని రాజ్ హామీ ఇచ్చారని, దానికి సంబంధించి రెండు విడతలుగా రూ.60 కోట్లు చెల్లించానని కొఠారి తెలిపారు. అయితే డబ్బును వ్యాపారం కోసం వినియోగించకుండా, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారని కొఠారి ఆరోపించారు. కొన్ని రోజులకు కుంద్రా ఈ రుణాన్ని పెట్టుబడిగా మార్చమని తనను అభ్యర్థించారని, ప్రతి నెలా 12 శాతం వడ్డీతో సహా అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని కొఠారి చెప్పారు. దీని తరువాత, కొఠారి ఏప్రిల్ 2015లో షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం ద్వారా రూ.31.95 కోట్లు బదిలీ చేయగా, సెప్టెంబర్‌లో సప్లిమెంట్ ఒప్పందం ద్వారా రూ.28.53 కోట్లు మళ్లీ బదిలీ చేశాడు. ఈ నిధులన్నీ బెస్ట్ డీల్ టీవీ బ్యాంకు ఖాతాకు వెళ్లాయి. అయితే దీని తరువాత శిల్పా-రాజ్ లు తమ డబ్బును తిరిగి ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తమ మాటను నిలబెట్టుకోలేదని, తన డబ్బును దుర్వినియోగం చేశారని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై నమోదైన కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు కోర్టు లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం దాటి వెళ్లడానికి లేదు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, కోర్టు ద్వారా దీనికి సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్ బిగ్ సర్‌ప్రైజ్
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

