AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్‌కు ప్రేయసిగా.. రామ్ చరణ్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగా..

ఈ హీరోయిన్ తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టి పడేసింది. అయితే పెళ్లయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలకు దాదాపు దూరంగానే ఉంటోంది. కానీ బాలీవుడ్ లో మాత్రం రచ్చ లేపుతోంది.

పవన్ కల్యాణ్‌కు ప్రేయసిగా.. రామ్ చరణ్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగా..
Bollywood Actress
Basha Shek
|

Updated on: Sep 10, 2025 | 9:43 PM

Share

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కల్యాణ్. అనతికాలంలోనే పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా తండ్రి, బాబాయిల అడుగు జాడల్లోనే నడిచాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతను కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగిపోయాడు. అయితే ఈ బాబాయి, అబ్బాయిలతో కలిసి ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ ఇలా ఈ ఇద్దరు మెగా హీరోలతో రొమాన్స్ చేశారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా, మరో సినిమాలో రామ్ చరణ్ కు అక్కగా నటించింది. రెండు సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఈ నటికి కూడా మంచి పేరొచ్చింది. అందం, అభినయం పరంగా ఫుల్ మార్క్స్ పడ్డాయి. మరి ఆమె ఎవరో తెలుసా? తను మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార కృతి కర్బందా.

ఇవి కూడా చదవండి

తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది కృతి. తొలి సినిమాతో అందం, అభినయం పరంగా మంచి మార్కులను కొట్టేసింది. ఆ తర్వాత అలా మొదలైంది సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఇక తీన్ మార్ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రేమికురాలిగా నటించి అందరి మన్ననలు అందుకుంది కృతి. ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ కు అక్కగానూ ఆకట్టుకుంది. రామ్ ఒంగోలు గిత్త, కల్యాణ్ రామ్ 3D తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.

కృతి కర్బందా లేటెస్ట్ ఫొటోస్..

అయితే ప్రస్తుతం ఈ అందాల తార బాలీవుడ్ కే పరిమితమైంది. గతేడాది నటుడు పులకిత్ సామ్రాట్ ను పెళ్లి చేసుకుంది కృతి. అంతకు ముందు చాలా ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు.

భర్తతో కృతి కర్బందా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..