AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: బాబా వంగా చెప్పిందే నిజమైందా..? మహా యుద్ధం మొదలైందా.. అసలేం చెప్పారంటే..?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచం మరో ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది. ఈ క్రమంలో బాబా వంగా ప్రవచనం నిజమవుతుందా? 2026 నాటి మహా యుద్ధం మొదలైందా? యూరప్ బంజరుగా మారుతుందా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Baba Vanga: బాబా వంగా చెప్పిందే నిజమైందా..? మహా యుద్ధం మొదలైందా.. అసలేం చెప్పారంటే..?
Did Baba Vanga Predict The Iran Us Israel Conflict
Krishna S
|

Updated on: Feb 28, 2026 | 9:15 PM

Share

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అటు ఇరాన్ సైతం కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై మిసైల్ దాడులు చేసింది. దీంతో గల్ఫ్ కంట్రీస్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టి బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చేసిన చెప్పిన విషయంపై ఉంది. ఏళ్ల క్రితమే ప్రపంచ సంఘటనలను ముందుగానే ఊహించిన ఘనత బాబా వంగాకు ఉంది. ఆమె అనుచరులు ఇప్పుడు ఆమె ప్రవచనాలను తాజా పరిణామాలతో ముడిపెడుతున్నారు.

2026 ప్రారంభంలో తూర్పు నుండి ఉద్భవించిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ఆమె జోస్యం చెప్పారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు ఆ యుద్ధానికి నాంది అని చాలా మంది భావిస్తున్నారు. ఈ సంఘర్షణలో యూరప్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయని, యుద్ధం తర్వాత యూరప్‌లోని భూమి పూర్తిగా బంజరుగా, అస్థిరంగా మారుతుందని ఆమె అంచనా వేశారు. ఇది పెద్ద ఆర్థిక, సామాజిక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో రష్యా అగ్రరాజ్యంగా ఉద్భవిస్తుందని, రష్యా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని ఆమె ప్రవచించారు.

తాజా పరిణామాలు

ప్రస్తుత పరిస్థితులు బాబా వంగా జోస్యాన్ని నిజం చేసేలా ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు టెహ్రాన్‌లోని సుప్రీం నాయకుడి కార్యాలయాల సమీపంలో దాడులు చేశాయి. ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది, దీనివల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అంతేకాకుండా ప్రపంచ చమురుకు కీలకమైన హర్మూజ్ జలసంధింని ఇరాన్ మూసివేసింది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలన్నీ బాగా వంగా చెప్పినట్లే జరుగుతున్నాయని ఆమె అనుచరులు చెబుతుండడంతో అంతా ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.

Follow Us