ఆదిలాబాద్ జిల్లా బెల్గం గ్రామంలో మచ్చ స్వామి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఫ్రిజ్ పేలి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఇల్లంతా వ్యాపించి గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.