AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పాముతో పరిహాసమా? ప్రాణాల మీదికి తెచ్చిన నిర్లక్ష్యం.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో వైరల్!

పాములను రక్షించే షాకింగ్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒక విషపూరితమైన నాగుపామును రక్షించే ప్రయత్నంలో.. పాములు పట్టే వ్యక్తి చేసిన ఒక చిన్న అజాగ్రత్త అతని ప్రాణాల మీదికి తెచ్చింది.

Watch: పాముతో పరిహాసమా? ప్రాణాల మీదికి తెచ్చిన నిర్లక్ష్యం.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో వైరల్!
Snake Catcher
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 7:48 PM

Share

పాములను రక్షించే షాకింగ్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒక విషపూరితమైన నాగుపామును రక్షించే ప్రయత్నంలో.. పాములు పట్టే వ్యక్తి చేసిన ఒక చిన్న అజాగ్రత్త అతని ప్రాణాల మీదికి తెచ్చింది. ఒక చేత్తో కాలరాట నడుపుతూ, మరో చేత్తో యముడిలాంటి పాముతో ఆటలాడిన ఆ యువకుడి నిర్లక్ష్యపు విజువల్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోను పరిశీలిస్తే.. ఒక ఇంటి ఆవరణలోకి చాలా పెద్దదైన, అత్యంత ప్రమాదకరమైన నాగుపాము వచ్చింది. దాన్ని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఒక స్నేక్ క్యాచర్ అక్కడికి వస్తాడు. మొదట అతను పాములను పట్టే కర్రతో నాగుపామును అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అక్కడే అతను ఊహించని పెద్ద పొరపాటు చేశాడు. ఒక చేత్తో ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ, ఏకాగ్రత లోపించిన స్థితిలో పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పామును సంచిలో పెట్టడానికి దాని తల భాగాన్ని పట్టుకునేందుకు కర్రను తీసివేసి కింద కూర్చోగానే.. ఆ నాగుపాము కనురెప్పపాటులో మెరుపు వేగంతో అతని చేతిని తన దవడలతో గట్టిగా పట్టుకుని దారుణంగా కాటు వేసింది.

వీడియోలోని తర్వాతి భాగంలో దృశ్యం అత్యంత భయానకంగా ఉంది. నాగుపాము కాటుకు గురైన ఆ వ్యక్తి నొప్పితో విలవిలలాడుతూ ఆసుపత్రిలోని ఐసీయూ పడకపై ప్రాణాల కోసం పోరాడుతూ కనిపించాడు. అతని శరీరమంతా పాము విషం వ్యాపిస్తున్న లక్షణాలు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే, అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఉన్నవారు అతడిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల అద్భుతమైన సమయస్ఫూర్తి, వెంటనే విరుగుడు మందు ఇవ్వడం వల్ల అతని చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతను ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు సమాచారం.

కాగా, ఈ కింగ్ కోబ్రా, స్పెక్టాకిల్డ్ కోబ్రా విషం పూర్తిగా ‘న్యూరోటాక్సిక్’ రకానికి చెందినదిగా గుర్తించారు. ఇది మానవ నాడీ వ్యవస్థపై నేరుగా, అత్యంత వేగంగా దాడి చేస్తుంది. నాగుపాము కాటు వేసినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపుతో పాటు చూపు మసకబారడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఈ విషం ఊపిరితిత్తులు, గుండె కండరాలను వేగంగా పక్షవాతానికి గురిచేసి, మరణానికి కారణమవుతుంది. నాగుపాము కాటు తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలతో బ్రతకడానికి కేవలం 30 నిమిషాల నుండి 2 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్‌లో రోగికి సరైన విరుగుడు ఇంజెక్షన్ అందకపోతే శ్వాస ఆడక, గుండె ఆగిపోయి చనిపోతారు.

ఈ వీడియో చూసిన తర్వాత పాములు పట్టే వ్యక్తి చూపిన మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యంపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాములను రక్షించడం అనేది ప్రాణాలతో కూడుకున్న వ్యవహారం, అది ఒక ఆట కాదు. ఆ సమయంలో ఫోన్‌లో మాట్లాడాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ప్రాణం పోయుంటే పరిస్థితి ఏంటి?” అని ఒకరు ప్రశ్నించగా.. “ఇది తెలివి తేటలు కావు, స్వయంకృతాపరాధ మూర్ఖత్వం. అతనికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు దండం పెట్టాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు. వన్యప్రాణులను, ముఖ్యంగా విషపూరిత జీవులను పట్టుకునేటప్పుడు క్షణకాలం ఏకాగ్రత కోల్పోయినా ప్రాణాలు గాల్లో కలుస్తాయని హెచ్చరిస్తూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us