AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 తినమంటే 4 తింటారు.. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకొనే హల్వా పూరి!

పండగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సాంప్రదాయ పిండివంట లేదా స్వీట్ రెసిపీ చేయడం మన ఆనవాయితీ. ముఖ్యంగా స్వీట్స్ విషయానికి వస్తే పప్పు బొబ్బట్లు లేదా శనగపప్పుతో చేసే భక్ష్యాలు అందరికీ గుర్తొస్తాయి. అయితే ప్రతిసారీ ఒకే రకమైన బొబ్బట్లు తిని బోర్ కొట్టిన వారికి, వంటగదిలో ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ సమయంలో నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేలా ఒక సరికొత్త స్వీట్ రెసిపీ ఉంది. అదే 'హల్వా బొబ్బట్లు' లేదా 'హల్వా పూరి'.

Phani CH
|

Updated on: Jul 13, 2026 | 9:13 PM

Share
ఈ స్వీట్ తింటే ఎవరైనా సరే రెండు తినమంటే నాలుగు తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన హల్వా పూరిని ఇంట్లోనే ఎంతో సులభంగా, పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ నోరూరించే హల్వా పూరి తయారీ కోసం మనం ముందుగా పైపొర పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకు ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి.

1 / 5
మీకు మైదా వద్దు అనుకుంటే రెండు కప్పుల వరకు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. ఇందులో పావు స్పూన్ ఉప్పు, రెండు మూడు స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని పూరి పిండి కంటే కాస్త మెత్తగా, సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక పైనుండి మరో మూడు స్పూన్ల ఆయిల్ వేసి, వేళ్లతో బాగా నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా సాఫ్ట్ గా ఉంటుంది. దీనిపై మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు లోపల పెట్టే హల్వా స్టఫింగ్ ను సిద్ధం చేయడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మూడు కప్పుల నీటిని పోయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వను (ఉప్మా రవ్వ) వేస్తూ గడ్డలు కట్టకుండా కంటిన్యూగా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ కాస్త చిక్కబడిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి.

3 / 5
పాలు వేయడం వల్ల హల్వా ఎంతో సాఫ్ట్ గా మారుతుంది. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక ఒక కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసి కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంచి రంగు కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్, నాలుగు చెంచాల నెయ్యి మరియు మంచి సువాసన కోసం రెండు మూడు దంచిన యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. హల్వా దగ్గరపడి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. చల్లారిన హల్వాను చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కలిపి పెట్టుకున్న పిండిని కూడా సమాన పరిమాణంలో బాల్స్ లా చేసుకోవాలి.

4 / 5
ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ లేదా బట్టర్ పేపర్ పై కొద్దిగా ఆయిల్ రాసి, ఒక పిండి ముద్దను తీసుకుని చేత్తో వెడల్పుగా ప్రెస్ చేయాలి. అందులో హల్వా బాల్ ను ఉంచి, ఎక్కడా బయటకు రాకుండా పైనుండి క్లోజ్ చేసి అదనపు పిండిని తీసేయాలి. ఆ తర్వాత దానిపై మరో కవర్ వేసి చేత్తో మెల్లగా నొక్కితే చపాతీ కర్రతో పని లేకుండా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా హల్వా పూరి సిద్ధమవుతుంది. చివరగా స్టవ్ పై దోశ పెనం పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి, ఈ హల్వా పూరీలను అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. నెయ్యితో కాల్చడం వల్ల ఇవి ఎంతో రుచిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తాయి. ఈ కమ్మటి స్వీట్ ను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇది అందరికీ నచ్చుతుంది.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!