పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన శ్వేతనాగు దర్శనమిచ్చింది. పూజారి కైంకర్యాలు నిర్వహిస్తుండగా గర్భగుడిలో నాగదేవత విగ్రహాల ఎదురుగా ఈ తెల్లటి నాగు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. భక్తులు దీనిని శుభసూచకంగా భావిస్తున్నారు.