AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్యూటీ టైంలో డిస్కో డాన్స్.. జైలు బాస్ బర్త్‌డే వేడుకల్లో యూనిఫాంతో ఖాకీల చిందులు.. !

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లోని సెంట్రల్ భైరవ్‌గఢ్ జైలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బర్త్‌డే వేడుకల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన జైలు ప్రాంగణంలో.. ఏకంగా ఆర్కెస్ట్రా పెట్టి సినిమా పాటలకు జైలు అధికారులు చిందులు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

డ్యూటీ టైంలో డిస్కో డాన్స్.. జైలు బాస్ బర్త్‌డే వేడుకల్లో యూనిఫాంతో ఖాకీల చిందులు.. !
Bhairavgarh Jailer Dance
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 10:13 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లోని సెంట్రల్ భైరవ్‌గఢ్ జైలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బర్త్‌డే వేడుకల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన జైలు ప్రాంగణంలో.. ఏకంగా ఆర్కెస్ట్రా పెట్టి సినిమా పాటలకు జైలు అధికారులు చిందులు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

జూలై 9న భైరవ్‌గఢ్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు పుట్టినరోజును పురస్కరించుకుని జైలు పరిపాలన విభాగం ఆవరణలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్‌తో పాటు ఒక ప్రైవేట్ ఆర్కెస్ట్రాను కూడా రప్పించారు. ఈ క్రమంలో జైలు డిప్యూటీ జైలర్ సురేష్ గోయల్.. తాను వేసుకున్న పోలీస్ యూనిఫాంలోనే స్టేజ్ ఎక్కి బాలీవుడ్ నటుడు గోవింద నటించిన “ఆప్కే ఆ జానే సే…” అనే పాటకు ఊపు తెప్పించేలా నృత్యం చేశారు. ఆయనతో పాటు అక్కడున్న ఇతర జైలు సిబ్బంది కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వేడుకలో బర్త్‌డే బాయ్, జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహుకు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు.

ఈ విజువల్స్ కాస్తా బయటకు రావడంతో జైలు నిబంధనలు, భద్రతపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలపై నిఘా ఉంచాల్సిన అధికారులు.. ఇలా జైలు లోపల ఆర్కెస్ట్రాలు పెట్టి ఎంజాయ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై డిప్యూటీ జైలర్ సురేష్ గోయల్ స్పందిస్తూ.. రోజంతా ఉండే పని ఒత్తిడి, మానసిక ఉల్లాసం కోసమే సిబ్బందితో కలిసి కాసేపు సరదాగా డాన్స్ చేశామని సమర్థించుకున్నారు.

కానీ జైలు మాన్యువల్ రూల్స్ ప్రకారం ఇలాంటి సున్నితమైన ప్రదేశాల్లో వినోద కార్యక్రమాలకు అనుమతి లేదు. పైగా ఖాకీ యూనిఫాంలో నృత్యాలు చేయడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..