చిన్నారుల ఆరోగ్యానికి పండ్ల రసాల కంటే పండ్లే శ్రేష్ఠమని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది. పండ్ల రసాల వల్ల పిల్లల్లో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పండ్లలోని ఫైబర్ చక్కెరను నిదానంగా రక్తంలోకి చేర్చడం వల్ల కాలేయంపై భారం పడదు. పిల్లలకు పండ్ల రసాలకు బదులు పండ్లు అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.