Ramayana: ట్రైలర్ రిలీజ్‌కు రెడీ… టెన్షన్‌లో రామాయణ టీమ్..
నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ పార్ట్ 1’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదల కానుండగా, అంతకుముందు శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. ‘ఆదిపురుష్’ వివాదం తర్వాత రాముడు, సీత, రావణుడి లుక్స్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లుక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల విశ్వాసాన్ని గెలుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ పార్ట్ 1’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ గ్లింప్స్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ ఎక్స్‌పీరియన్స్ తరువాత రామాయణ లుక్స్ విషయంలో ఆడియన్స్‌లో టెన్షన్ కనిపిస్తోంది. అసలు రామాయణ ట్రైలర్ లాంచ్ విశేషాలేంటి? లుక్స్ విషయంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? డీటైల్డ్‌గా చూద్దాం. బాలీవుడ్‌లో మైథలాజికల్ సినిమాలంటేనే ఈమధ్య ఆడియన్స్‌లో క్యూరియాసిటీతో పాటు భయం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో ట్రైలర్ ఎంతగా నెగెటివ్ అయ్యిందో, లుక్స్ మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నితేష్ తివారీ ‘రామాయణ’ టీమ్ ముందున్న అతిపెద్ద సవాల్ ఈ హర్డిల్‌ను దాటడమే. ఆదిపురుష్ సినిమా విషయంలో రామ రావణ లుక్స్ మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా పడింది. అందుకే ఆ తరువాత మైథలాజికల్ మూవీస్ చేస్తున్న మేకర్స్ ప్రతీ విషయంలోనూ మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. రామాయణ టీమ్ కూడా అదే చేస్తోంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌లో జూలై 23న ప్రదర్శించి, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవల్‌లో ఈ రేంజ్ ప్రమోషన్స్ జరగడం ఇదే తొలిసారి. ముందు నుంచి ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్న మేకర్స్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ లుక్స్ అత్యంత కీలకం కానున్నాయి. ఆదిపురుష్ చేసిన తప్పులను రిపీట్ చేయకుండా పక్కా ప్లానింగ్‌తో రామాయణ టీమ్ విజువల్స్ డిజైన్ చేసింది. అఫీషియల్ ట్రైలర్‌లో పాత్రల ఆహార్యం ఎలా ఉండబోతోందన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

