Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!
సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ సినిమాకు మొదట హీరోగా నాని పేరు పరిశీలించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథ నచ్చినప్పటికీ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని టాక్. చివరకు సత్యదేవ్ ఈ చిత్రంలో నటించగా, ఆయన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వార్తతో ఒకవేళ నాని ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.
సత్యదేవ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మించడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 03న రావ్ బహదూర్ సినిమా రిలీజైంది. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ చాలా మంది ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. సినిమా కథ కథనాలు డిఫరెంట్ గా ఆకట్టకునేలా ఉన్నా కొన్ని నెగెటివ్ కామెంట్స్ ను మూటగట్టుకుంది. అయితే సత్యదేవ్ యాక్టింగ్‌కి మాత్రం అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సత్యదేవ్ నటనకు నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. రావు బహదూర్ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. గతంలో కేరాఫ్ కంచరపాలెం లాంటి సూపర్ హిట్ సినిమాను తీశారు వెంకటేష్ మహా. అలాగే సత్యదేవ్ తో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి డిఫరెంట్ మూవీని కూడా తెరకెక్కించారు. ఇప్పుడు అదే సత్యదేవ్ తో రావు బహదూర్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు హీరోగా సత్యదేవ్ మొదటి ఆప్షన్ కాదట. ఈ సినిమాను మొదట న్యాచురల్ స్టార్ నానితో చేయాలని మహా అనుకున్నారట. అందుకు తగ్గట్టే నాని ని కలిసి స్టోరీ ని వివరించగానే , ఆయనకు కూడా కాన్సెప్ట్ బాగా నచ్చిందట. అయితే ఎందుకో కానీ ఈ మూవీ చేసేందుకు నాని ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఒక వేళ రావు బహదూర్ సినిమాను నాని చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదోనని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

