Shekar Master Vs Jani Master: తెలుగు ఫిలిం డ్యాన్సర్ అసోసియేషన్లో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికలు, సభ్యత్వాల అంశాలపై శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుకుంది. ఈ నేపథ్యంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య వివాదం నెలకొంది. అధ్యక్షురాలు సుమలతపై ఆరోపణలు చేస్తూ పది మంది డ్యాన్సర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.