OTT Movie: ఫ్రెండ్స్ ఇలా కూడా వెన్నుపోటు పొడుస్తారా? ఓటీటీలో సర్వైవల్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్
ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీకి ఐఎమ్ డీబీలోనూ ఏకంగా 9.4 రేటింగ్ దక్కడం విశేషం.

ఇప్పుడు మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీ ఆడియెన్స్ అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో ఉండే మలయాళం సినిమాలను తెలుగుతో పాటు అన్ని భాషల వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా మలయాళం సినిమానే. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. మలయాళం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ థ్రిల్లర్ మూవీకి ఏకంగా 9.4 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ నేపథ్యంలో ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆనంద్, మిథున్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే కాలేజీ రోజుల్లో క్యాస్ట్ డిఫరెన్సెస్ ఇతర కారణాల వల్ల వీరి మధ్య గ్యాప్ వస్తుంది. మిథున్ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ నుంచి, ఆనందు కాస్త హైయర్ సోషల్ స్టేటస్ ఫ్యామిలీ కి చెందడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఇంతలో వాళ్ల గ్రామంలో ఒక కార్పొరేట్ కంపెనీ వస్తుంది. సంస్థ ఏర్పాటుకు స్థలాలు ఇవ్వడంతో మిథున్ కమ్యూనిటీకి జాబ్స్, ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తారు. అయితే ఆనంద్ కూడా ఈ సంస్థతో చేతులు కలుపుతాడు.. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాలయ్యాక మిథున్ ఫారెస్ట్ ఆఫీసర్ అవుతాడు. ఆనంద కూడా నగరంలో సక్సెస్‌ఫుల్ బిజినెస్ మెన్ గా చెలామణి అవుతాడు.
అయితే ఒకసారి మిథున్ ఆనందుని, వాళ్ల కామన్ ఫ్రెండ్‌ని ఒక ఫారెస్ట్ క్యాంప్‌కి ఆహ్వానిస్తాడు. అయితే ఈ మీటింగ్ వెనుక మిథున్ హిడెన్ రివెంజ్ మోటివ్ ఉందని తెలుస్తుంది. కానీ ఈ విషయం తెలియక ఫారెస్ట్ క్యాంప్‌లో ఆనందు, మిథున్, వాళ్ల ఫ్రెండ్ కలుస్తారు. అక్కడ వీళ్లకు ఒక డేంజరస్ గ్రూఫ్ తారసపడుతుంది. ఈ రెండు గ్రూప్స్ మధ్య ఒక చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ పెద్ద గొడవగా మారుతుంది. అదే సమయంలో మిథున్ కూడా తన రివేంజ్ ప్లాన్ ను అమలు చేయాలనుకుంటాడు. కానీ ఆనంద్ కూడా తన ప్లాన్ తో కౌంటర్ చేస్తాడు. చివరకు ఈ కథ ఒక సర్వైవల్ గేమ్ గా మారుతుంది? మరి ఈ ఆటలో ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారు? ఫ్రెండ్స్ ఏమయ్యారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎవరూ ఊహించని థ్రిల్లింగ్ క్లైమాక్స్ తో ముగిసే ఈ సినిమాపేరు మీషా. ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళం సస్పెన్స్ సినిమాలో కత్తిర్ (మిథున్), హక్కీమ్ షాజహాన్ (ఆనందు), షైన్ టామ్ చాకో, సుధి కోప్ప, జెయో బేబీ, శ్రీకాంత్ మురళి, హస్లీ అమాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మలయాళం సినిమా రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తమిళ్ వెర్షన్ ఆహా తమిళ్ లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
రెడు ఓటీటీల్లోనూ..
Action-ah thriller-ah?🤔💭 Rendum thaan!!!!#Meesha premieres from Sept 12th on @ahatamil #Meeshaonaha #ahatamil pic.twitter.com/FVBEvxcimF
— aha Tamil (@ahatamil) September 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








