Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఓటింగ్.. డేంజర్‌జోన్‌లో ఊహించని కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయాయి. నామినేషన్స్ కూడా హోరా హోరీగా జరిగాయి. ఇక కంటెస్టెంట్స్ సత్తాను బయట పెట్టే ఓటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే కారణాలేమిటో తెలియదు కానీ టాప్ లోనూ, డేంజర్ లోనూ ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ ఉన్నారు.

సెప్టెంబర్ 07న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టిలు సెలబ్రెటీ హోదాలో హౌస్‌లోకి అడుగుపెట్టారు. హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్‌లు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక మంగళవారం హస్ లో నామినేషన్స్ కూడా జరిగాయి. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ మొదటి వారం నామినేషన్స్ లిస్టుల నిలిచారు. కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ చేసిన సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ వారం భరణి తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రెటీలు నామినేషన్స్‌లో నిలవడం గమనార్హం. ఇక సామాన్యుల నుంచి పవన్ ఒక్కడు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు మొదటి వారం హౌస్‌ను వీడతారనేది ఆసక్తిగా మారింది.
ఇక కంటెస్టెంట్స్ కు ఆన్ లైన్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్ గా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడడం లేదు. అయితే ఓటింగ్ లో మాత్రం సుమన్ దూసుకుపోతున్నాడు. దీనికి కారణం అతనిపై ఉన్న సాఫ్ట్ కార్నర్ కారణమేమోననిపిస్తోంది. అయితే చాలా సైలెంట్ గా ఉన్న సుమన్ శెట్టి నామినేషన్స్ టైంలో సంజనకు ఉన్నట్లుండి కౌంటర్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో సుమన్ మరింత యాక్టివ్ గా మారొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఓటింగ్ లో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఓటింగ్ లో కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి టాప్‌లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఏకంగా 23 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ 20 శాతానికి పైగా ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డిమోన్ పవన్, రీతూ చౌదరి, రాము రాథోడ్ వరుసగా 4,5,6 స్థానాల్లో ఉన్నారు. ఇక ఏడో స్థానంలో సంజనా గల్రానీ, 8,9 స్థానాల్లో వరుసగా ఫ్లోరా శైనీ, శ్రష్టి వర్మలు ఉన్నారు.
ఆన్ లైన్ ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం ఫ్లోరా శైనీ, శ్రష్టి వర్మలు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి చాలా సమయం ఉండడంతో అప్పటిలోపు ఏమైనా జరగొచ్చు. మరి మొదటి వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








