AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్.. జాక్ పాట్ కొట్టిన కామనర్స్.. ఎక్కువ ఎవరికో తెలుసా?

కంటెస్టెంట్ల క్రేజ్, పాపులారిటీ ఆధారంగానే రెమ్యునరేషన్ ఫైనల్ చేస్తారు. అలాగే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాకనే ఈ పారితోషికం అందజేస్తారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లిస్టులో టాప్ లో ఎవరు ఉన్నారంటే?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్.. జాక్ పాట్ కొట్టిన కామనర్స్.. ఎక్కువ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 10, 2025 | 7:37 PM

Share

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 07) జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో గొడవలు షురూ అయ్యాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతుంటుంది? అలా ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు? కామనర్స్ పారితోషికాలు ఎలా ఉన్నాయి? అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి? అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి.

ముందుగా కామన్ మ్యాన్ కేటగరీలో హౌస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు రూ.15,000 నుండీ రూ.20,000 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి రూ. 70,000 ఇవ్వనున్నారన్నమాట.

ఇవి కూడా చదవండి

కామనర్స్ కు కూడా గట్టిగానే..

ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయేల్ కు వారానికి రూ.2,50,000లు, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్ లకు వారానికి రూ.2,00,000లు ఇవ్వనున్నారట.

నటుడు భరణికే టాప్ రెమ్యునరేషన్..

ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగు పెట్టిన తనూజ, రీతు చౌదరీ, సుమన్ శెట్టి లకు వారానికి రూ.2,75,000, నటి ఫ్లోరా శైనీకి రూ.3,00,000లు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతనికి వారానికి సుమారు రూ.3,50,000లు ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..