AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : రీతూ తలకు గాయం.. షాంపూ బాటిల్ కోసం సంజన రచ్చ.. ఫ్లోరా కన్నీళ్లు..

బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంత ఊహించినంతగా జరగలేదు. సంజన మాత్రం హౌస్మేట్స్ అందరితో గొడవలు పెట్టుకుంటూ చిరాకు పుట్టిస్తోంది. షాంపు బాటిల్ కోసం పెద్ద రచ్చ చేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది.

Bigg Boss 9 Telugu : రీతూ తలకు గాయం.. షాంపూ బాటిల్ కోసం సంజన రచ్చ.. ఫ్లోరా కన్నీళ్లు..
Bigg Boss 9 Tleugu
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2025 | 9:53 AM

Share

బిగ్‏‏బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో స్టార్ట్ అయ్యింది. ఇక ఫస్డ్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా హిటెక్కించేలా జరగలేదు. ఆమె నాతో మాట్లాడలేదు. తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు. ఇక మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పిస్తూ అడియన్స్ దృష్టిలో పడుతుంది. దీంతో అందరూ ఆమె నామినేట్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి సంజన వింత వాదనలు అందరికీ చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది.

బాత్‌రూంలో షాంపూ, కండీషనర్ పెట్టకండి.. బయటకొండి అంటూ ఫ్లోరా చెబుతుంటే.. నావే.. ప్రతిసారి బయటకు తీయాలా.. ఒక సెట్ అక్కడ ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన. దీంతో విసుగొచ్చిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా.. బాత్‌రూం క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా.. ? అని నిలదీసేసరికి సంజన ఫైర్ అయ్యింది. మ్యానర్స్ లేదు.. అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో సంజనా మరింత ఫైర్ అయ్యింది. ఏమన్నావ్.. ఫుటేజ్ కోసమా.. నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. చీప్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గర శ్రీజను చూపిస్తూ అది సైకో.. దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

ఆ తర్వాత టెనెంట్స్ లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్ లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. సుత్తి అందుకున్నవారు నామినేట్ చేస్తారు . ఇందులో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దీంతో ఆమెను మెడికల్ రూంకు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. మిగతా నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్ లో కొనసాగనున్నాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?