AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఫేమ్ సంజన చెల్లెలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా? బావ కూడా ఫేమస్ హీరో

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంలో ఈ అమ్మడి ఆట తీరును చూసి మొదటి వారమే ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ ఆడియెన్స్ కూడా సంజన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.. కానీ కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కే ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైంది. -

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఫేమ్ సంజన చెల్లెలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా? బావ కూడా ఫేమస్ హీరో
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 18, 2025 | 8:44 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7 ప్రారంభమైన బుల్లితెర రియాలిటీ షో ఇప్పటికే రెండో వారానికి చేరుకుంది. మొత్తం 15 కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ కూడా ఒకరు. ప్రభాస్ బుజ్జిగాడులో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ఆమె కన్నడ, తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వార్తల్లోనూ నిలిచింది. అలాగే పెళ్లితోనూ సెన్సేషన్ అయ్యింది. ఇక సీజన్ ప్రారంభంలో సంజనా ఆట తీరు అందరినీ నిరాశపర్చింది. హౌస్ లో ఉన్న సెలబ్రెటీలు, సామాన్యులు మొత్తం సంజనకు రివర్స్ గా మారిపోయారు. సోషల్ మీడియాలోనూ ఆమెపై నెగెటివీటీ కనిపించింది. అయితే అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించి బిగ్ బాస్ సీజన్ 9కి ఫస్ట్ కెప్టెన్ గా సంజన గల్రాని నిలిచింది. దీంతో హౌస్ మేట్స్ తో పాటు బిగ్ బాస్ ఆడియెన్స్ కూడా అవాక్కయ్యారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా తోటి హౌస్ మేట్స్ కు చుక్కలు చూపిస్తోంది సంజన గల్రాని. అయితే ముద్దుగుమ్మ గురించి చాలా మందికి తెలియన విషయం ఒకటుంది. అదేంటంటే.. సంజనా చెల్లెలు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఎక్కువగా తమిళ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించిన అందాల తార ఒకటి, రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు నిక్కీ గల్రానీ. అదే నండి.. మన ఆది పినిశెట్టి సతీమణి.

ఇవి కూడా చదవండి

భర్త ఆది పినిశెట్టితో నిక్కీ గల్రానీ..

మలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన నిక్కీ గల్రానీ కృష్ణాష్టమి అనే సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇందులో సునీల్ హీరోగా యాక్ట్ చేశాడు. అయితే మలుపు సినిమా షూటింగ్ లోనే హీరో ఆది పినిశెట్టితో ప్రేమలో పడిన అందాల తార 2022 మార్చిలో అతనితో కలిసి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. అదే ఏడాది మేలో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నిక్కీ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. అయితే ఆది మాత్రం వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవల అతను నటించిన మయసభ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..