- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan shows off her shoulder Tattoo, Know What does it mean
Actress Trisha: భుజంపై స్పెషల్ టాటూతో త్రిష.. మీనింగ్ ఏంటో తెలుసా? ఫొటోస్ వైరల్
సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిషకు టాటూలంటే బాగా ఆసక్తి. అందుకే తన ఒంటిపై పలు చోట్ల పచ్చ బొట్టులు వేయించుకుంది. అయితే తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన త్రిష తన భుజంపై ఉన్న టాటూను చూపిస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. మరి ఆ పచ్చబొట్టు స్పెషల్ ఏంటో తెలుసా?
Updated on: Sep 17, 2025 | 11:20 PM

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో త్రిష కూడా ఒకరు. అప్పుడెప్పుడో 2002లో నీ మనసు నాకు తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైందీ అందాల తార.

రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ఉంటోన్న త్రిష వయసు ప్రస్తుతం సుమారు 40 ఏళ్లకు పైగానే. అయినా ఈ ముద్దుగుమ్మ అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీ ట్యాగ్ తో కుర్ర హీరోయిన్లకు పోటీ నిస్తోందీ అందాల తార.

సినిమాలతో పాటు త్రిషకు టాటూలంటే బాగా ఆసక్తి. అందుకే తన ఒంటిపై వివిధ రకాల గుర్తులతో పచ్చబొట్లు ఉంటాయి. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన త్రిష కెమెరాలకు పోజులిచ్చింది. అందులో ఆమె భుజంపై ఉన్న టాటూ బాగా హైలెట్ అయ్యింది.

ఇంతకీ త్రిష భుజంపై ఉన్న టాటూను చూశారా? కెమెరా! సినిమాల కోసం కెమెరా ముందుకు వచ్చిన త్రిష... ఆ కెమెరానే భుజంపై టాటూగా వేయించుకుంది. ఈ ఈవెంట్ లో త్రిష ధరించిన డ్రెస్ ఆమె బాడీ అంతటిని కవర్ చేసింది ఒక్క టాటూను తప్ప

ప్రస్తుతం త్రిష టాటూకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజనలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాలో కనిపించింది త్రిష. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.




