- Telugu News Photo Gallery Cinema photos This Bollywood Movie Metro In Dino Now Trending in Netflix OTT
Cinema : యాక్షన్ లేదు.. విలన్లు లేరు.. అయినా జనాలు తెగ చూసేస్తున్నారు.. ఓటీటీలో సంచలనం ఈ మూవీ..
2025లో విడుదలైన ఓ సినిమా.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు.. చి ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాలో యాక్షన్ లేదా ఫైటింగ్ లేదు. 2 గంటల 40 నిమిషాల సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
Updated on: Sep 17, 2025 | 11:48 PM

యాక్షన్ , ఫైట్స్ సీన్స్ ఉన్న సినిమాలు చూసి విసుగొచ్చిందా.. అయితే ఇప్పుడు ఒక మధురమైన చిత్రాన్ని గురించి తెలుసుకోవాల్సిందే. ఇందులో రక్తపాతం లేదు. నాలుగు జంటల కథ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. మనం మాట్లాడుతున్న చిత్రం పేరు "మెట్రో ఇన్ డినో."

"మెట్రో ఇన్ డినో" అనేది 2025లో విడుదలైన ఒక సంగీత ప్రేమకథా చిత్రం. ఇందులో అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, కొంకోన సేన్ శర్మ, సారా అలీ ఖాన్ నటించారు. దీనికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు.

ఈ కథ వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన నాలుగు జంటల చుట్టూ తిరుగుతుంది. కొన్ని జంటలు వివాహం తర్వాత చాలా సంతోషంగా ఉండరు, మరికొందరు తమ వివాహం గురించి గందరగోళం చెందుతారు. ఇంతలో ఒక జంట సంబంధం కెరీర్ సవాళ్లతో ఇబ్బందుల్లో పడుతుంది.

Metro In Dino Telugu

"మెట్రో ఇన్ డినో" ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం దేశంలోని టాప్ 10 జాబితాలో 5వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. "సైయారా" మొదటి స్థానంలో, "ఇన్‌స్పెక్టర్ జెండే" రెండవ స్థానంలో, "మెటీరియలిస్ట్స్" మూడవ స్థానంలో, విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" నాల్గవ స్థానంలో ఉన్నాయి.




