OTT Movie: 10 కోట్లతో తీస్తే 50 కోట్లకు పైనే.. ఓటీటీలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు..
సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ సినిమాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందుకే ఆడియెన్స్ ఎక్కువగా ఈ జానర్ సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఇదే కోవకు చెందినది. కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి.

ప్రస్తుతం థియేటర్లలో అయినా, ఓటీటీలో అయినా మలయాళం సినిమాలదే హవా. వాస్తవానికి దగ్గరంగా ఉండే కథా, కథనాలు, నటీనటులు న్యాచురల్ పెర్ఫామెన్స్, తెలిసిన కథనే అయినా గ్రిప్పింగ్స్ స్క్రీన్ ప్లే తో కట్టి పడేయం ఇక్కడి సినిమాల స్పెషాలిటీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తే కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చాయి. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈమూవీ థియేటర్లలో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే. కేరళలోని త్రివేండ్రం చుట్టూ తిరుగుతుంది. నగరంలో ఒక సీరియల్ కిల్లర్ చిన్నపిల్లలను టార్గెట్ చేసి, వారిని క్రూరంగా చంపుతూ, శవాలను ముక్కలు ముక్కలుగా చేసి పూడుస్తుంటాడు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు ACP రిథికా ఎక్సావియర్ రంగంలోకి దిగుతుంది.ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక టీమ్‌ను అడుగుతుంది. అయితే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సామ్యూల్ జాన్ కట్టూక్కారన్ (టొవినో థామస్) ఏసీపీ టీమ్ లోకి వస్తాడు. అతను మరెవరో కాదు ఆమె ఎక్స్ హస్బెండ్ ఎక్సావియర్ (సాయిజు కురుప్) సోదరుడు.
గతంలో ఏసీపీ కూతురు కూడా ఇలాగే హత్యకు గురై ఉంటుంది. దీంతో రితికా– ఎక్సావియర్ విడాకులు తీసుకుంటారు. ఇక కేసు విచారణలో సీరియల్ కిల్లర్ ఒక చిన్న పిల్ల అని అనుమానిస్తాడు.అయితే ఎవరూ దీనిని నమ్మరు. అయితే ఓ డెడ్ బాడీని పూడ్చే క్రమంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. కానీ నగరంలో మరిన్ని హత్యలు జరుగుతాయి. మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చిన్న పిల్లలను టార్గెట్ గా చేసుకున్నాడు? చివరకు పోలీసులు ఎలా ఆ కిల్లర్ ను పట్టుకున్నారు? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ పేరు ఫోరెన్సిక్. అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ దర్శకత్వంలో, ప్రభావ్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ లో టోవినో థామస్ (సామ్యూల్ జాన్ కట్టూక్కారన్), మామతా మోహన్‌దాస్ (ACP రిథికా ఎక్సావియర్), సాయిజు కురుప్ (ఎక్సావియర్) తదితరులు ప్రధాన పాత్రల పోషించాడు. సన్సెన్స్ , థ్రిల్లింగ్ సీన్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండే ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా చూసే వారికి ఫోరెన్సిక్ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








