Tollywood: ఈ అన్నదమ్ములను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోలు.. వరుసగా సినిమాలు చేస్తున్నా..
మొన్నటి చిరంజీవి- పవన్ కల్యాణ్ మొదలుకుని నేటి విజయ్ దేవరకొండ- ఆనంద్ దేవరకొండ వరకు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న అన్నదమ్ములు చాలా మందే ఉన్నారు. వీరు కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు వీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరోలు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఒకరు పదేళ్ల క్రితం నుంచే సినిమాలు చేస్తుంటే మరొకరు మాత్రం రీసెంట్ గానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ హీరోలకు లక్ కలిసి రావడం లేదు. ముఖ్యంగా ఇందులో ఒకరు గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోతున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ హీరో సినిమాలు వర్కవుట్ కావడం లేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల లో ఈ హీరో అదరగొట్టేస్తాడు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడంతో ఫైట్స్ దుమ్ము దులుపుతాడు. అలాడే డ్యాన్సులు ఇరగదీస్తాడు. ఇక ఈ హీరో ఇప్పటివరకు దాదాపు స్టార్ హీరోయిన్లందరితోనూ సినిమాలు చేశాడు. సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమా పరమేశ్వరన్ తదితర క్రేజీ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. అయినా కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇలా అన్ని అంశాలు కలిసివస్తోన్నా ఈ హీరోకు లక్ మాత్రం కలిసి రావడం లేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) మరో హారర్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకు వచ్చాడు. అతనే బెల్లంకొండ శ్రీనివాస్. పై ఫొటోలో అతనితో ఉన్నది సోదరుడు బెల్లంకొండ గణేశ్.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధ పురి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి కిష్కింధ పురి సినిమాతో జోడీ కట్టారు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో టైసన్ నాయుడు, హైంధవ సినిమాలు ఉన్నాయి.
తండ్రితో బెల్లం కొండ సురేశ్ తో శ్రీనివాస్, గణేశ్..
View this post on Instagram
ఇక బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తొలి ప్రేమ దర్శకుడు కరుణాకరన్ తో ఓ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








