Cinema: మెగా మేనల్లుడు రిజెక్ట్ చేసిన కథతో శర్వానంద్ సినిమా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో చేయడం ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటుంది. అలా మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో శర్వానంద్ ఓకే చెప్పాడు.. కట్ చేస్తే..

మెగా మేనల్లుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సాయి దుర్గతేజ్ (ఈ మధ్యన పేరు మార్చుకున్నాడు). తనదైన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. విరూపాక్ష సినిమాతో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. మధ్యలో జరిగిన ఓ యాక్సిడెంట్ తో ఈ మెగా హీరో జోరు తగ్గినా ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి. అదే సమయంలో తన వద్దకు వచ్చిన కథలను కూడా చాలానే రిజెక్ట్ చేశాడీ మెగా హీరో. స్టోరీ తనకు సూటవ్వదనో, అభిమానులకు నచ్చదనో, డేట్స్ అడ్జెస్ట్ చేయకపోవడం.. ఇలా తదితర కారణాలతో పలు సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకున్నడీ క్రేజీ హీరో. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శతమానం భవతి సినిమా గురించి.
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు సినిమా శతమానం భవతి. దిల్ రాజు తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మొదట ఈ చిత్రాన్ని తేజూతోనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. తేజూకు కథ కూడా చెప్పాడట. మెగా హీరోకు సైతం ఈ స్టోరీ బాగా నచ్చింది. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా చేయలేకపోయాడట. దీంతో ఈ మూవీ శర్వానంద్ వద్దకు చేరింది. 2017 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో ఓ మంచి సినిమాను మిస్ అయ్యాడు సాయి దుర్గ తేజ్.
కాగా ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు సాయి దుర్గ తేజ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తల్లి చేతుల మీదుగా అవార్డు అందుకుంటోన్న సాయి దుర్గ తేజ్..
FIRST PIC:- My first award in my first life is taken by AMMA
SECOND PIC:- My first award in my second life is taken by AMMA
En janmalo punyam chesukunano Telidhu Neeku kodukku ga putanu AMMA ❤️ pic.twitter.com/iNDgk6ZNeq
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








