iBOMMA Ravi: ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్
ఐ బొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇతని పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలో సినిమాలను పైరసీ చేస్తూ నిర్మాతలకు వేలాది కోట్ల నష్టం కలిగించిన ఇమ్మడి రవి అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు కావడంతో తెలుగు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాగార్జున, ఎస్ ఎస్ రాజమౌళి తదితర ఇమ్మడి రవి అరెస్టుపై స్పందించారు. పైరసీ కింగ్ పిన్ ను చాక చక్యంగా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఇమ్మడి రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలను పైరసీ చేసిన అతనిని ఎన్ కౌంటర్ చేయాలని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 18) ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ మాట్లాడారు.. ‘ఒక సినిమా అనేది వందలాది మంది కష్టం. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఐబొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలి. కడుపు మంటతో, బాధతో ఇలా మాట్లాతున్నాను. ఒకవేళ అదే జరిగితే.. ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారు’
‘నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది నన్ను అడిగారు. మన సినిమా ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్‌మెంట్‌కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఫిల్మ్ ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తాం’ అని సి. కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Producer C Kalyan
ఐబొమ్మ రవి ఆగడాలను వివరిస్తోన్న సీవీ ఆనంద్..
Hyd Police Statement : #Nani ‘s #HIT 3 film was uploaded in iBomma before 18 hours of its theatrical release and that too in Original HD quality.
But later they found that it is hacked by Ravi pic.twitter.com/oiYcwStjVo
— OTT Trackers (@OTT_Trackers) November 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
