Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. 19 ఏళ్ల వయసులోనే 32 ఏళ్ల హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలకు తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఒకప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలకు సినీరంగంలోకి తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నజ్రియా నజీమ్. నేరమ్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజా రాణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది.
ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో నటించిన నజ్రియా.. నాని జోడిగా అంటే సుందరానికి సినిమాలో కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. మలయాళీ హీరో ఫహద్ ఫాసిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ సమయంలో నజ్రియా వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అలాగే ఫహద్ వయసు 32 సంవత్సరాలు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి తమిళంలో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తమిళ్ హీరో సూర్యతో కలిసి ఓ సినిమా చేయనుందట. ఈ చిత్రానికి జీతు మాధవన్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అలాగే టి స్టూడియోస్’ నిర్మిస్తున్న ‘ది మద్రాస్ మిస్టరీ – ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్’ అనే సిరీస్ లో నటి నజ్రియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో అలియాస్ నటరాజ్, శంతను భాగ్యరాజ్, నాసర్, వై.జి. మహేంద్రన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తానికి దాదాపు 11 సంవత్సరాలకు నజ్రియా తమిళంలోకి రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..




