Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార. సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది.

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యష్ తో కలిసి టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. ఇదెలా ఉంటే.. 100 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ ఈ ఒక్క ప్రముఖ నటుడితో నటించడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది.
ఇదెలా ఉంటే.. ఎన్ని కోట్లు పారితోషికం ఇచ్చినా ఒక్క హీరోతో కూడా నటించనని నయనతార చెప్పినట్లు ఓ టాక్ నడుస్తుంది. ఆ హీరోతో అసలు నటించడానికి నిరాకరించిందట. అతడు మరెవరో కాదు.. శరవణన్. ఆయన తమిళ నటుడు, ఆయన తీసిన `ది లెజెండ్` సినిమా 2022లో విడుదలైంది. శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా హిట్ కాలేదు. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని శరవణన్ చాలా ప్రయత్నించాడు. కానీ నయనతార అంగీకరించలేదు.
నయనతార స్థానంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా హీరోయిన్‌గా ఎంపికయ్యారు. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అలియా భట్ పారితోషికం విషయంలో చాలా ముందున్నారు. తనకు ఈ సినిమాకు రూ.100 కోట్లు ఇచ్చినా అతడితో నటించనని చెప్పిందట. ప్రస్తుతం నయన్ సినిమాలతోపాటు అటు వ్యాపారరంగంలోనూ దూసుకుపోతుంది.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..




