AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

బిగ్ బాస్ రియాల్టీ షోకు అన్ని భాషలలోనూ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా విన్నర్ విషయంలో అడియన్స్ అంచనాలు ఒక్కసారిగా మారిపోతుంటారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..
Bigg Boss Updates
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2025 | 10:03 PM

Share

బిగ్ బాస్ రియాల్టీ షో.. విమర్శలు వచ్చిన అదే స్థాయిలో రెస్పాన్స్ సైతం వస్తుంటుంది. అందుకే అన్ని భాషలలోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో దూసుకుపోతుంది. అయితే ఒకప్పుడు బిగ్ బాస్ షోకు పాజిటివ్ రివ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. హౌస్ లో కంటెస్టెంట్స్ కంటే బయట ఉండే పీఆర్ టీమ్స్ మాత్రమే విన్నర్ ఎవరనేది డిసైడ్ చేస్తున్నాయి. తమ కంటెస్టెంట్ గెలిపించేందుకు మిగత కంటెస్టెంట్లకు సంబంధించిన వీడియోను కట్ చేసి తమకు నచ్చినట్లు షేర్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పీఆర్ టీమ్ మ్యాటర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ? అసలు విషయం ఇక్కడే ఉంది. ఇటీవల మలయాళంలో బిగ్ బాస్ షో పూర్తైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా మలయాళీ సీరియల్ నటి అనుమోల్ నిలిచింది. అయితే ఆమె గెలిచిన విధానంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

ఆమె సీజన్ 7 ట్రోఫీతోపాటు రూ.42 లక్షల ఫ్రైజ్ మనీ, SUV కారు గెలుచుకుంది. అనుమోల్ గెలవడానికి కారణం ఆమె పీఆర్ టీమ్ అని ప్రచారం జరుగుతుంది. అనుమోల్ తన పీఆర్ టీమ్ కోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిన్సీ సెబాస్టియన్ అనే తోటి కంటెస్టెంట్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన అనుమోల్.. తనకు పీఆర్ టీమ్ ఉన్న మాట నిజమే కానీ రూ.16 లక్షలు చెల్లింలేదని అన్నారు. గతంలో తనను ఓ పీఆర్ టీమ్ 15 లక్షలు అడగ్గా.. అంత తాను ఇవ్వలేనని చెప్పిందట. కేవలం రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చానని.. మిగిలిన అమౌంట్ బయటకు వచ్చాకా ఇస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అనుమోల్. ఈ విషయం గురించి హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ బిన్సీ సెబాస్టియన్ తో ముచ్చటించింది అనుమోల్. అయితే ఇప్పుడు వీరిద్దరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

దీంతో బిగ్ బాస్ రియాల్టీ షోలో గెలవాలంటే కంటెస్టెంట్స్ ఆట తీరు కాదు.. బలమైన పీఆర్ టీం ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పుడు సీజన్ 9లో బలమైన కంటెస్టెంట్స్ గా సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, రీతూ, డీమాన్ పవన్, తనూజ ఉన్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. వీరిద్దరిలో పోల్చుకుంటే తనూజ పీఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్. అంతేకాదు.. ఆమెకు బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున పెద్ద పీఆర్ టీమ్స్. తనూజ చేసిన మిస్టేక్స్ పక్కన పెట్టి.. ఆమెకు ఎదురు తిరిగిన కంటెస్టెంట్స్ మిస్టేక్స్ వీడియోస్ ప్లే చేసి మరీ చూపిస్తుంటారు. కానీ అంతకు ముందు రేషన్ మేనేజర్ విషయంలో ఇమ్మాన్యుయేల్ కు ఓకే అని చెప్పి.. ఆతర్వాత నాగార్జున ముందు వద్దు అన్నాను అంటూ మాట మార్చింది. దీంతో నాగ్ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తనూజను ఏకిపారేశారు ఇమ్మూ ఫ్యాన్స్. గతవారం నామినేషన్స్ సమయంలో రాము రాథోడ్ చేయి పైన కళ్యాణ్ పేరు రాస్తూ నామినేట్ చేయమని చెప్పింది తనుజ. ఇద విషయాన్ని నాగార్జున అడగ్గా.. నో అనే చెప్పింది. చివరకు నాగ్ సైతం ఏమనలేక వదిలేశారు. దీంతో బిగ్ బాస్ విజేత తనూజ అని.. అందుకే ఆమెకు సపోర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?