Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
భారతీయ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కమల్ హాసన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీతారలు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ పర్సనల్ విషయాలు, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దక్షిణాదిలోని టాప్ హీరోలలో కమల్ హాసన్ ఒకరు. ఈరోజు (నవంబర్ 7న) ఆయన పుట్టినరోజు. ప్రస్తుతం కమల్ వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సితనీప్రియులను అలరిస్తున్నారు. తమిళంలో అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన ఆయన బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘కళాధుర కన్నమ్మ’ (1960) ఆయన మొదటి చిత్రం. ఆ సమయంలో కమల్ వయసు 6 సంవత్సరాలు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన కమల్.. హీరోగానూ ఎన్నో హిట్ మూవీస్ చేశారు. హీరోయిజం సినిమాలు కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషలలో నటించారు. కేవలం నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, స్క్రీన్ రైటర్, సింగర్ సైతం.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
కమల్ హాసన్ అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.450 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఇండియన్ 2 సినిమాకు రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నారట. కమల్ హాసన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. చెన్నైలో ఆయనకు ఒక భవనం ఉంది. దాని ధర రూ.131 కోట్లు. ఆయన దగ్గర BMW 730, లెక్సస్ LX 570 సహా అనేక కార్లు ఉన్నాయి.
విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మరో హిట్టు అందుకోలేకపోయారు. గతేడాది థగ్ లైఫ్ సినిమాతో జనాల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2 చిత్రంలోనూ కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..




