- Telugu News Photo Gallery Cinema photos Meenakshi Chaudhari Interesting Comments About the Goat Movie
Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
సినీరంగంలో గుర్తింపు రావాలంటే అందం, ప్రతిభతోపాటు అదృష్టం కూడా ముఖ్యమే. వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ అవకాశాలు రావడం చాలా కష్టం. అలాంటి వారిలో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు. కొన్నాళ్లుగా తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు సరైన బ్రేక్ కోసం చూస్తుంది.
Updated on: Oct 31, 2025 | 9:19 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో వరుసగా విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో దక్షిణాదిలో డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది.

తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఓ సినిమా విషయంలో తాను తప్పు చేశానని అంటుంది మీనాక్షి. గతంలో ఓ సినిమా చేసినందుకు ఎంతో బాధపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సినిమా మరేదో కాదండి. దళపతి విజయ్ నటించిన గోట్.

విజయ్ దళపతి నటించిన ది గోట్ చిత్రంలో నటించింది మీనాక్షి. అయితే ఆ సినిమా విడుదల తర్వాత తన పాత్రపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్ర పై వచ్చిన విమర్శలు చూసి ఎంతో బాధపడ్డానని.. వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ ట్రోల్స్ వల్ల తాను ఎంచుకునే కథలు, సినిమాలపై మరింత ఫోకస్ పెట్టాలని అర్థమైందని.. అప్పటి నుంచి తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న వాటినే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు మీనాక్షి వెల్లడించింది. ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది మీనాక్షి.

ఇక లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ ఉన్నట్లుండి ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.




