Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక.. ఆకట్టుకుంటున్న ఫోటోస్..
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని రోజుల్లో ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా అక్టోబర్ 31న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Oct 31, 2025 | 9:05 PM

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఇరు కుటుంబాలతోపాటు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల పెద్దల సమక్షంలలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

వీరి నిశ్చితార్థ వేడుకలో అల్లు కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అల్లు శిరీష్.

నిన్న అల్లు శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టింది. అక్టోబర్ 31న తమ సొంతింట్లో నిశ్చితార్థ వేడుక కోసం చేసుకున్న ఏర్పాట్లకు వరుణుడు ఆటంకం కలిగించాడని ఎంగేజ్మెంట్ డెకరేషన్ వర్క్స్ ఫోటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

‘చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను… కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అంటూ శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలయ్యింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని తమ సొంతింట్లోనే శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ జరిగింది.




