Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాస్ జాతర సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వెంకీ. ఈ చిత్రాన్ని మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

సాధారణంగా తెలుగు సినిమా ప్రపంచంలో కొన్ని సినిమాలు ప్రత్యేకంగా ఉండిపోతారు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ సినిమాలు ఫ్రెష్ గానే ఉంటాయి. అందులో పలు సన్నివేశాలను తలుచుకోవడమే ఆలస్యం అడియన్స్ ముఖాల్లో నవ్వులు పూస్తాయి. సినిమాలోని తారల యాక్టింగ్ ఇప్పటికీ జనాల హృదయాల్లో నిలిచిపోయాయి. అలాగే పాటలు సైతం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ అందుకుంటాయి. అలాంటి చిత్రాల్లో వెంకీ. తెలుగు సినీరంగంలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి చెప్పక్కర్లేదు. అంతేకాదు ఇందులో బ్రహ్మానందం, రవితేజ మధ్య సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులోనీ మీమ్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇందులో రవితేజ, స్నేహ హీరోహీరోయిన్లుగా నటించారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించారు. అలాగే కథానాయికగా స్నేహ కనిపించింది. కానీ ఆమె కంటే ముందు మరో హీరోయిన్ అనుకున్నారట. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఆసిన్. ఈ సినిమాకు ముందుగా ఆసిన్ అనుకున్నామని.. కానీ కుదర్లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. ట్రైన్ సీన్స్‌లో ప్రముఖ కమెడియన్ ఎం.ఎస్.నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదని అన్నారు. వెంకీ సినిమా బాగుందని చిరంజీవి సర్ చెప్పడమే తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. 2004 మార్చి 26న విడుదలైన ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో బ్రహ్మానందం, ఏవీఎస్, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Asin
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




