గోవాలో అందాల గోల.. బాలయ్య బ్యూటీ క్రేజీ ఫొటోస్!
అందాల చిన్నది ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ చిన్నది తాజాగా గోవాలో ఎంజాయ్ చేస్తూ, అదిరిపోయే స్టైల్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందవులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Nov 07, 2025 | 9:08 AM

నటి ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. అందం, అభినయం ఉన్నా, రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు.

వరుణ్ తేజ సరసన కంచె మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ అవి అంతగా హిట్ అందుకోలేదు, కానీ నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన అఖండ మూవీలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొంది.

ఇక ఈ మూవీ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాల తర్వాత డాకు మహారాజ్‌లో నటించి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.

రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ ఇక సమయం దొరికిన ప్రతి సారి వెకేషన్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ, గోవాలో సందడి చేసింది. తన క్యూట్ నెస్‌తో అందరినీ మాయ చేస్తుంది. నడుము అందాలతో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ ఓ లుక్ వేయండి.



