Bigg Boss 9 Telugu: గౌరవ్కు తనూజ, ఇమ్మూ వెన్నుపోటు.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ఆరుగురు..
బిగ్‌బాస్ సీజన్ 9లో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం సీక్రెట్ టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో రెబల్స్ ఎవరో తెలియక జుట్టు పట్టుకుంటున్నారు హౌస్మేట్స్. ఇక తమకు ఇచ్చిన సీక్రెట్ టాస్కులు విజయవంతంగా కంప్లీట్ చేసి సుమన్ శెట్టి, దివ్య ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

బిగ్‌బాస్ సీజన్ 9.. గత వారం రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా సీక్రెట్ టాస్కులు సక్సెస్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరో కొత్త రెబల్ గా రీతూను ఎంపిక చేశాడు బిగ్‌బాస్ . నిన్నటి ఎపిసోడ్ లో ఘోస్ట్ టాస్కులో తనూజ గెలవడంతో రోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీంకు దక్కింది. టీమ్ మొత్తం చర్చించుకుని ఈ బ్యాడ్జ్ ఎవరికీ ఇవ్వాలో డిసైడ్ కావాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాము, తనూజ, ఇమ్మూ, గౌరవ్ నలుగురూ మాట్లాడుకున్నారు. మొదటి టాస్కులో రాము, ఇమ్మూ కలిసి ఆడి గెలిచారు. దీంతో అప్పుడు బ్యాడ్జ్ ఇమ్మూ తీసుకున్నాడు. ఇక ఈసారి తనూజ ఒంటరిగా గెలవడంతో ఆమెకు బ్యాడ్జ్ కావాలని పట్టుబట్టింది. దీంతో ఇమ్మూ ఇచ్చేశాడు. ఆ తర్వాత వస్తే తనకు కావాలని చెప్పాడు గౌరవ్. ఇందుకు ముగ్గురు ఓకే అన్నారు. ఇక ఆ తర్వాత రెయిజ్ ది ఫ్లాగ్ టాస్కులో మరోసారి ఆరెంజ్ టీం గెలిచింది.
అయితే ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఎవరికి దక్కాలో చర్చించుకోవాలని బిగ్‌బాస్ చెప్పడంతో నలుగురు మళ్లీ మాట్లాడుకున్నారు. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ చేసింది తనూజ. సేఫ్టీ బ్యాడ్జ్ ఒకరి తర్వాత మరొకరికి పాస్ కావడం కరెక్ట్ కాదు.. గౌరవ్ కు ఇస్తే ఇమ్మూకు అన్యాయం, ఇమ్మూకు ఇస్తే గౌరవ్ కు అన్యాయం.. అందుకే నా దగ్గరే ఉండాలి అన్నట్లుగా మాట్లాడటంతో ఇమ్మూ, గౌరవ్ ఇద్దరూ ఒప్పుకోలేదు. అదేంటీ.. ఈసారి వస్తే నాకు గానీ, రాము గానీ తీసుకోవాలని ముందే మాట్లాడుకున్నాం కదా అంటూ వాదించాడు గౌరవ్. చివరకు గౌరవ్ కు సేఫ్టీ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇక సుమన్ శెట్టితో ఫోన్ మాట్లాడుతూ.. మీరు సీక్రెట్ టాస్కులు పూర్తి చేశారు. దివ్య, సుమన్ శెట్టి సక్సెస్ అయ్యారు. ఇకపై మరో రెబల్ వస్తారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అన్నాడు. ఇదే విషయాన్ని సుమన్ దివ్యకు చెప్పాడు. ఆ తర్వాత రీతూతో ఫోన్ మాట్లాడుతూ ఆమెను రెబల్ అని చెప్పాడు బిగ్‌బాస్ . ఇంట్లో ఎవరితోనైనా సీరియస్ గా గొడవ పడాలని చెప్పడంతో వాష్ రూం ఏరియా దగ్గర కూర్చున్న ఇమ్మూతో గొడవపడింది. దీంతో మొదటి సీక్రెట్ టాస్కు విజయవంతంగా కంప్లీట్ చేసింది.
సీక్రెట్ టాస్కు పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ ఇవ్వడంతో.. ముందు గౌరవ్ పేరు చెప్పి.. ఆ తర్వాత సాయి పేరు చెప్పింది. దీంతో సాయితో మాట్లాడిన బిగ్‌బాస్ .. నిన్ను రేసు నుంచి తప్పించారు అని చెప్పడంతో సాయి షాకయ్యాడు. ఆ తర్వాత మరో సీక్రెట్ టాస్కు ఇస్తూ.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటోను ఎవరికీ కనిపించకుండా దొంగతనం చేసి సీక్రెట్ ప్లేస్ లో పెట్టాలని.. టాస్కు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ విషయం ఇమ్మూన్యుయేల్ కు చెప్పొద్దని అన్నాడు బిగ్‌బాస్ . అయితే ఈ టాస్కు కంప్లీట్ చేయలేకపోయింది రీతూ. ఆ తర్వాత అందరికి నోటీస్ పంపించాడు. అందులో రెబల్ ఎవరనేది చెప్పాలని అన్నాడు. దీంతో తనూజ, ఇమ్మూ, రీతూ, సుమన్ శెట్టి, సంజన, భరణి అందరూ గౌరవ్ పేరు చెప్పారు. ఆ తర్వాత ఇమ్మూకు మూడు ఓట్లు వచ్చాయి. కానీ ఎక్కువగా గౌరవ్ పేరు రావడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు.
సీక్రెట్ టాస్కులు కంప్లీట్ చేసిన దివ్య, సుమన్ శెట్టి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారని బిగ్‌బాస్ అనౌన్స్ చేయడంతో హౌస్మేట్స్ షాకయ్యారు. మరో రెబల్ సీక్రెట్ టాస్కు సక్సెస్ చేయలేకపోయినా మరో అవకాశం ఇస్తున్నానని అన్నారు. దివ్య, సుమన్ శెట్టితోపాటు మరో మిగిలిన తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూలలో నలుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం ఉందని.. ఎవరో సెలక్ట్ చేయాలంటూ హౌస్మేట్స్ కు వదిలేశాడు. దీంతో ముందే నేను తప్పుకుంటానని చేతులెత్తేశాడు రాము. ఆ తర్వాత రీతూ, భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




