Gouri Kishan: నీ బరువు ఎంత ? రిపోర్టర్ ప్రశ్న.. హీరోయిన్ మాస్ రిప్లై..
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది గౌరీ కిషన్. తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. 96 సినిమాతో పాపులర్ అయిన గౌరీ కిషన్.. తాజాగా తన కొత్త సినిమా ప్రెస్ మీట్ లో బరువు గురించి ప్రశ్న అడగడంపై సీరియస్ అయ్యింది.

తమిళంలో విడుదలైన 96 సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష టీనేజ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది గౌరీ కిషన్. అదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. తెలుగులోనూ అదే పాత్రలో కనిపించింది. కేరళకు చెందిన గౌరీ కిషన్ తెలుగుతోపాటు,తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా రాణిస్తుంది. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. విజయ్ మాస్టర్, ధనుష్ కర్ణన్, జి.వి. ప్రకాష్ అడియే, ఉలగమై, హాట్‌స్పాట్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది గౌరీ. ఆమె ప్రస్తుతం అదర్స్ చిత్రంలో నటిస్తోంది. అబిన్ హరికరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలైంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంది.
ఈ క్రమంలో నవంబర్ 6న చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న ఓ విలేకరి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు ?’ అని అడిగారు. దీంతో గౌరీ కిషన్ సీరియస్ అయ్యింది. ‘నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు? ఇదంతా ఎవరినైనా శారీరకంగా అవమానించడమే.. నేను ఒక సినిమాలో నటించాను. దాని గురించి అడగండి. నువ్వు అడిగినది నా ఇమేజ్ ని ఎగతాళి చేయడం లాంటిది’ అంటూ ఘాటుగానే బదులిచ్చింది. దీంతో మరోసారి సదరు విలేకరి స్పందిస్తూ.. ‘అప్పుడు అడిగిన ప్రశ్నే మళ్లీ అడుగుతున్నాను. నేను సాధారణంగా అడిగే ప్రశ్ననే అడిగాను, నేను తప్పుగా ఏమీ అడగలేదు. నేను నిన్ను మోడీ గురించి అడగవచ్చా? ఖుష్బు, సరిత లాంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
దీంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది గౌరీ కిషన్.. నేను ఒక సినిమాలో నటించాను. అందులో నా పాత్ర గురించి అడగండి. మీరు నా బరువు గురించి అడగడం నాకు ఇష్టం లేదు. సినిమాలో నా పాత్ర గురించి అడగకుండా నా బరువు తెలుసుకోవడం అంత ముఖ్యమా ? నేను ఇక్కడ ఉన్న ఏకైక మహిళను. నా చుట్టూ చాలా మంది పురుషులు ఉన్నారు. మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఒక నటి బరువు తెలుసుకోవడం అసభ్యకరం. ఇది ప్రశ్నార్థకం కాదు. మీరు మీ వృత్తికి అవమానం తెస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యింది.
Full support to Gowri kishan 👍 https://t.co/amGJKHDN6g
— Villainism (@Karuppu_7) November 6, 2025
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..




