Duvvada Srinivas Madhuri: వెండితెరపై దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ కూడా.. ఈ వారమే థియేటర్లలోకి సినిమా
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో దివ్వెల మాధురి సందడి చేసింది. హౌస్ లో చాలా రోజులు ఉంటుందనుకున్న ఆమె మూడు వారాలకే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడామె సిల్వర్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అది కూడా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి..

దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురిల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్ని నెలలుగా వీరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ జంట పేరు తెగ వినిపిస్తోంది. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఛాన్స్ దక్కించుకుంది దివ్వెల మాధురి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిందామె. మొదట్లో అందరిపై నోరు పారేసుకున్న మాధురి ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకుంది. దీంతో ఆమె చాలా రోజులు హౌస్ లో ఉంటుందనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. మూడు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమె పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఇంటర్వ్యూలు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాధురి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది మాధురి. వీటిలో ఆమె చేసే వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పటికే బిగ్ బాస్ తో బుల్లితెరపై సందడి చేసిన మాధురి ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించనుంది. ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ప్రేమంటే’. థ్రిల్లు ప్రాప్తిరస్తు… అనేది ఈ మూవీ క్యాప్షన్. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ – మాధురి జంట కూడా కనిపించనుందని సమాచారం. అయితే వారివి అతిథి పాత్రలా? లేదా క్యామియో రోల్సా? అసలు సినిమాలో వాళ్ళిద్దరి పాత్రలు ఎలా ఉంటాయి? తెరపై ఎంతసేపు కనిపిస్తారు? అన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు.
ప్రియదర్శి, ఆనందిల ప్రేమంటే సినిమా ట్రైలర్..
View this post on Instagram
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ప్రేమంటే సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటు ప్రముఖ యాంకర్ సుమ కనకాల, ‘వెన్నెల’ కిషోర్, ‘హైపర్’ ఆది, కిరిటీ దామరాజు, అభయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








