బాల్యాన్ని చూసి భవిష్యత్తుని అంచనా వేయకండి.. చిన్ననాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
సమాజంలో ఎవరూ ప్రస్తావించని కొన్ని విషయాలను డైరెక్టుగా తన సినిమాల రూపంలో చెబుతుంటాడీ హీరో. అందుకే ఇతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అన్నట్లు ఇతను మల్టీ ట్యాలెంటెడ్. నటనతో పాటు రచయితగా కూడా సత్తా చాటాడు. నిర్మాతగానూ, దర్శకుడిగానూ మెప్పించాడు.

ఇటీవల బాలల దినోత్సవం సందర్భంగా చాలా మంది తమ చిన్ననాటి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ త్రో బ్యాక్ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుని మురిసిపోయారు. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ ప్రముఖ నటుడు కూడా తన ఛైల్డ్ హుడ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.పైగా తన ఫొటోకు ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘బాల్యాన్ని చూసి భవిష్యత్తుని అంచనా వేయకండి’ అంటూ #HappyChildrensDay హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వమున్న ఈ నటుడు తన పోస్టుతోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో అంతర్లీనంగా ఒక బలమైన సందేశాన్ని వినిపించాడు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయద్దు’ అన్ని మెసేజ్ ఇచ్చాడు.
ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ ప్రముఖ నటుడు. నిర్మాత కూడా. దర్శకుడిగానూ సత్తా చాటాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే.. తన సినిమాల ద్వారా నిజాన్ని నిర్భయంగా చెబుతుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, నేరాలను తన సినిమాల రూపంలో ప్రజెంట్ చేస్తుంటాడు. అయితే తన సినిమాల్లో కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంటుంది. బూతులు కూడా బాగా వినిపిస్తుంటాయి. అందుకే సెన్సార్ సమస్యలు లేకుండా డైరెక్టుగా యూట్యూబ్ లోనే తన సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. వీటిని చూసిన చాలా మంది ఈ నటుడి సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడీ నటుడు వెండితెరపై కూడా మెరుస్తున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న ఓ స్టార్ యాంకర్ తనయుడి సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు పబ్లిక్ స్టార్ గా యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న బండి సరోజ్ కుమార్. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. తన మొదటి మూడు సినిమాలన్నీ నేరుగా యూట్యూబ్ లోనే రిలీజయ్యాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
మోగ్లీ సినిమా సెట్ లో బండి సరోజ్ కుమార్..
View this post on Instagram
ఇప్పుడు మోగ్లీ అనే సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు బండి సరోజ్ కుమార్. స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కలర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రోషన్ సరసన సాక్షి మండోద్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బండి సరోజ్ కుమార్ పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




