AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ఐఎమ్‌డీబీలో 8.2/10 రేటింగ్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సినిమాలో బూతులు ఉన్నా ఎంటర్ టైనింగ్ కంటెంట్ ఉండడంతో యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ఐఎమ్‌డీబీలో 8.2/10 రేటింగ్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 15, 2025 | 6:51 AM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా కె- ర్యాంప్. జైన్స్ నాని తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. అలాగే నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో బూతులు ఉండడంతో మొదట నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది కే- ర్యాంప్. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అనే సాంగ్ కు కిరణ్ అబ్బవరం చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ఈ కారణంగానే ఎప్పుడో రిలీజైన రాజశేఖర్ సినిమా ఆయుధం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చాలా మంది ఈ పాటను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేశారు. థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టిన కే ర్యాంప్ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అందుకు తగ్గట్టుగానే శనివారం (నవంబర్ 15) అర్ధరాత్రి నుంచే కే- ర్యాంప్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మించిన కే ర్యాంప్ సినిమాలో మురళీధర్ గౌడ్, వెన్నెల కిశోర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన కె ర్యాంప్ సినిమాకు ఐఎమ్‌డీబీ లో పదికి 8.3 రేటింగ్ దక్కడం విశేషం. మమరి ఈ సూపర్ హిట్ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఆహా ఓటీటీలో కె ర్యాంప్ మూవీని చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో కే- ర్యాంప్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను