AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 7600 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇండియాతో పాటు రిలీజైన అన్ని దేశాల్లోనూ వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. ఓవరాల్ గా రూ. 7600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.

OTT Movie: 7600 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 14, 2025 | 6:47 PM

Share

హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ సిరీసుల్లో జురాసిక్ పార్క్ ఒకటి. మన దేశంలోనూ డైనోసార్ల సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే జురాసిక్ సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడిదే సిరీస్ లో తెరకెక్కిన మరో చిత్రం జురాసిక్ వరల్డ్ రీ బర్త్. 2022లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌’కు సీక్వెల్‌గా దీనిని తెరకెక్కించారు. జులై 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ విడుదలైంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరీ గతంలో వచ్చిన సినిమాల్లా కాకపోయినా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలోనూ ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 7600 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం . 2025లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో కూడా సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్‌ ప్రైమ్ లో ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఇప్పుడు మరో ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని జియోహాట్‌స్టార్‌ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ జురాసిక్ పార్క్ సినిమాను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి గరేత్ ఎడ్వెర్డ్స్ దర్శకత్వం వహించగా… డేవిడ్ కోప్ కథ అందించారు. స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించగా… ఆడ్రినా మిరాండా, ఎడ్ స్క్రెయిన్, జొనాథన్ బెయిలీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.

ఇప్పుడు తెలుగులోనూ జురాసిక్ వరల్డ్ రీ బర్త్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి