AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: షాకింగ్.. బిగ్‌బాస్ హౌస్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. వీడియో వైరల్

బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్నే అందిస్తోంది. అదే సమయంలో ఈ రియాలిటీలు తరచూ వివాదాల్లో చిక్కకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కంటెస్టెంట్లు పరస్పరం కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Bigg Boss 9: షాకింగ్.. బిగ్‌బాస్ హౌస్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. వీడియో వైరల్
Bigg Boss 9
Basha Shek
|

Updated on: Nov 05, 2025 | 6:06 PM

Share

ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షోలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. తెలుగులో అయితే సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ మధ్యన బిగ్ బాస్ షోలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తెలుగులో మాదిరిగానే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతోంది. ఈ రియాలిటీ షో ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచాయి. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 15 మంది మొదటి నుంచి ఉండగా, ఇటీవలే మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యన తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 ప్రస్తుతం 5వ వారం లో ఉంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ హోరా హోరీగా జరిగింది. వినోద్, వియానా, శబరి, విక్రమ్, పార్వతి, కమ్రుదిన్, ప్రవీణ్, కెమి, తుషార్, దివాకర్, రమ్య జో.. ఇలా ఈ వారం మొత్తం 12 మంది నామినేట్ అయ్యారు.

అయితే తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంటెస్టెంట్లు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించి రిలీజైన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కమ్రుదిన్, ప్రవీణ్ ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దేని గురించి తెలియదు కానీ ఒకరినొకరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. మొదట మాటలతో ప్రారంభమైన ఈ వాగ్వాదం క్రమంగా ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో తారాస్థాయికి చేరుకుంది. కమ్రుదిన్ కోపంతో ప్రవీణ్ రాజ్ పైకి దూసుకెళ్లాడు. ఇతర కంటెస్టెంట్లు వీరిని ఆపడానిక ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కమ్రుదిన్, ప్రవీన్ ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం ఈ ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. మరి దీనిపై బిగ్ బాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తోన్న విజయ్ సేతుపతి దీనిపై ఎలా రియాక్టవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..