Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను చూస్తుంటే చిరంజీవి గుర్తుకొస్తున్నారు.. కే-ర్యాంప్ ఈవెంట్‌లో బండ్ల గణేష్

గతేడాది దీపావళికి క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈసారి దీపావళికి కే-ర్యాంప్ అంటూ మరో సూపర్ హిట్ మూవీతో మనల్ని పలకరించాడు. సోమవారం (నవంబర్ 3) కే- ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను చూస్తుంటే చిరంజీవి గుర్తుకొస్తున్నారు.. కే-ర్యాంప్ ఈవెంట్‌లో బండ్ల గణేష్
Kiran Abbavaram
Basha Shek
|

Updated on: Nov 03, 2025 | 10:24 PM

Share

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా కే- ర్యాంప్ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం (నవంబర్ 03) హైదరాబాద్ లో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. హీరో కిరణ అబ్బవరంతో పాటు చిత్ర బృందమంతా ఈ ఈవెంట్ కు హాజరైంది. అలాగే పలువురు సినీ ప్రముఖలు కూడా సందడి చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘నిజంగా ఇది కే ర్యాంపే. వరసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు మా తమ్ముళ్లు రాజేష్, శివ. సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్స్ వర్కవుట్ కావు.. రాజకీయాల్లో అవుతాయి. ఈ రోజు ఓ కుర్రాడి గురించి చెప్పాలి.. రాయచోటి అనే చిన్న ఊరు నుంచి వచ్చి బెంగళూరులో జాబ్ చేసి.. హీరో అయ్యాడు. మీకేదనిపిస్తే అది చేయండి.. మీ అమ్మ నాన్న కోసం మీ కలలు చంపుకోకండి. ఒక సినిమా హిట్ అవ్వగానే హే వాట్సాప్ వాట్సాప్ అంటూ కాల మీద కాలేసుకుంటున్న ఈ రోజుల్లో.. హిట్ల మీద హిట్లు కొడుతూ నా ఇంట్లో కుర్రాడిలాగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. కిరణ్‌ను చూస్తుంటే చిరంజీవి గారూ గుర్తుకొస్తున్నారు. రేపో మాపో భారతరత్న తీసుకోబోతున్న చిరంజీవిని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఈ కుర్రాడు పని చేసిన ప్రతీ సినిమా కొత్త దర్శకుడితోనే. ఒక్క సినిమా హిట్టైతే లోకేష్ కనకరాజ్ తీసుకురా, రాజమౌళిని తీసుకురా, సుకుమార్‌ను తీసుకురా అంటారు.. కిరణ్ అబ్బవరంను చూసి నేర్చుకోండి. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి. మీరు ఒకరోజే కొత్త వాళ్లే కదా.. కిరణ్ వరసగా ఆరుగురు కొత్త దర్శకులను పరిచయం చేసాడంటే ధైర్యం, ఖలేజా ఉన్నోడు ఈ కుర్రాడు. కే ర్యాంప్ అంటే ఇదే. ఆస్తి వారసత్వంగా ఇవ్వొచ్చు.. తెలివి ఎవ్వడూ వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్లు ఇస్తా గబ్బర్ సింగ్ ఇస్తారా నాకు.. కష్టపడితే విజయం వస్తది.. వాట్సాప్ వాట్సాప్ అంటే రాదు. నీ ఫ్యూచర్ కే ర్యాంప్’ అని ప్రసంగించాడు బండ్ల గణేష్.

చోటాకే  ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఫస్ట్ డే నెగిటివ్ టాక్‌తో మొదలైంది.. కానీ డే బై డే టాక్ పెరిగి బ్లాక్‌బస్టర్ స్టేజీకి వచ్చింది.. ఇలాంటి ఫలితం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. మా హీరో కిరణ్ అబ్బవరంతో పాటు అందరికీ థ్యాంక్స్’ అని చెప్పుకొచ్చారు.

‘సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు థ్యాంక్యూ.. నా ప్రతీ సినిమా అప్పుడు బండ్ల గణేష్ గారూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కిరణ్ అబ్బవరం గారూ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు.. అందరికీ థ్యాంక్స్’ అని బ్రహ్మకడలి తెలిపారు.