AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోలు, కోటీశ్వరుల సంబంధాలుకు నో చెప్పింది.. అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది..

సినిమా ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్.. ఒకప్పుడు కలల రాకుమారి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. ఎంతో మంది హీరోలు ఆమె వెంటపడ్డారు. కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా కూడా ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

స్టార్ హీరోలు, కోటీశ్వరుల సంబంధాలుకు నో చెప్పింది.. అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2025 | 9:19 AM

Share

చాలా మంది హీరోయిన్స్ బిజినెస్ మ్యాన్స్ , లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు. ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ.

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!

ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రావు గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాదు మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది రాశి. అప్పట్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది రాశి.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

అప్పట్లో రాశి నటించిన సినిమాల్ని సూపర్ హిట్ గా నిలిచాయి. దేవి అభయం అనే సినిమా తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టింది. ఆతర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రాశి. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది. జానకి కనగనలేదు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అయితే రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చినా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. శ్రీముని అలియాస్ ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట. ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు.. ఆసమయంలో శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట.. ఆతర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరుల, వ్యాపారవేత్తల సంబంధాలు వచ్చాయట.. అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్ గా చెప్పి పెళ్లి చేసుకుందట. తన లవ్ స్టోరీని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.

డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ

Rashi

 

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి