Mangalavaaram Movie: ఎంత పనిచేశావ్ అమ్మడు! ‘మంగళవారం’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పాయల్ రాజ్ పుత్ కెరీర్ లో మరపురాని చిత్రంగా మిగిలిపోయింది మంగళవారం. సినిమాలో కొంచెం బోల్డ్ సన్నివేశాలున్నా ఓవరాల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు పాయల్ మొదటి ఛాయిస్ కాదట

ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ చాలా సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ మాత్రం పడలేదు. అయితే తనను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టరే మళ్లీ ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా మంగళవారం. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2023 నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు. మంగళవారం తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూసిన పాయల్ కు మంగళవారం సినిమా బ్లాక్ బస్టర్ నిచ్చింది. డైరెక్టర్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
వారు వద్దన్నందుకే పాయల్ కు ఛాన్స్..
అయితే మంగళవారం సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆమె కన్నా ముందు డైరెక్టర్ అజయ్ భూపతి ఇద్దరు హీరోయిన్లను సంప్రదించాడట. అయితే కథ మరీ బోల్డ్ గా ఉండడంతో రిజెక్ట్ చేశారట. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది అదితి రావు హైదరి. అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం సినిమాలో అదితీ హీరోయిన్ గా నటించింది. దీంతో మంగళవారం సినిమా కథను కూడా మొదట అదితీ రావు హైదరీకే చెప్పాడట. కానీ ఎందుకో గానీ ఆమె ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. అలాగే ‘సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం, డార్లింగ్, ఆర్య-2’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్రద్దదాస్‌ను కూడా అనుకున్నారట. కథ కూడా వినిపించారట. అయితే ఆమె కూడా ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఫైనల్ గా మళ్లీ పాయల్ రాజ్ పుత్ నే కథానాయికగా తీసుకున్నారట అజయ్ భూపతి. అలా మొత్తానికి మంగళవారం సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా.
అదితీ రావు హైదరీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








