Singer Chinmayi: జానీ మాస్టర్‌కు వరుసగా సినిమా అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్.. అలా అనేసిందేంటి?
ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా సుమారు నెల రోజుల పాటు చంచల్ గూడ జైలులో కూడా ఉన్నాడీ స్టార్ కొరియోగ్రాఫర్. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో అతనికి కొరియోగ్రాఫర్ గా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో జానీకి ఛాన్సులు వస్తున్నాయి. ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నపాయి. ఈ నేపథ్యంలో గతంలో జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి ఇప్పుడు మరోసారి అతనిని ఉద్దేశిస్తూ ఒక సంచలన ట్వీట్ పెట్టింది. జానీతో పాటు మరో ప్రముఖ సింగర్ కార్తీక్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టవద్దు. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదు’ అని ట్వీట్ లో రాసుకొచ్చింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కొందరు ఆమెకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదంటూ చిన్మయిని విమర్శిస్తున్నారు.
సింగర్ చిన్మయి ట్వీట్..
I dont and will never understand the repeated platforming of Jani master or Singer Karthik.
Putting power and influence AND money in the hands of men who misuse it is like saying – Here is my support go sexually assault.
If there is a Karma theory at work – may it come back and…
— Chinmayi Sripaada (@Chinmayi) November 2, 2025
ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా సెట్ లో జానీ మాస్టర్..
That’s a wrap for #AndhraKingTaluka shoot ❤🔥
Get ready to witness UNTOLD EMOTIONS on the big screens! Exciting Month ahead ✨️🤩
GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 28th.#AKTonNOV28 Energetic Star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/aw9tAo69kz
— Mythri Movie Makers (@MythriOfficial) November 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








