AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో దోమల బెడద.. డెంగ్యూ బారిన పడి బయటకు వచ్చేసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్!

గత వారంలో తెలుగు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయేషా జీనత్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసింది. ఆమె మళ్లీ హౌస్ లోకి వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ఇప్పుడు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేశాడని తెలుస్తోంది.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో దోమల బెడద.. డెంగ్యూ బారిన పడి బయటకు వచ్చేసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్!
Bigg Boss Reality Show
Basha Shek
|

Updated on: Nov 01, 2025 | 9:46 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీషో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ.. ఇలా ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ రియాలిటీ షో నడుస్తోంది. తెలుగులో సీజన్ 9 ప్రారంభమై దాదాపు రెండు నెలల కావస్తోంది. పాత హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు హౌస్ రణరంగంగా మారింది. కన్నడ, తమిళ్, మలయాళ బిగ్ బాస్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే క్రమంలో ఈ రియాలిటీ షోస్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘బిగ్ బాస్ హిందీ సీజన్ 19’ తరచూ వార్తల్లో నిలిచింది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రవర్తిస్తోన్న తీరు, ఇతర వ్యవహారాలతో ఈ రియాలిటీ షో తీరుపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ప్రణీత్ మోర్ ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేశాడని వార్తలు వస్తున్నాయి.

ప్రణీత్ మోర్ ఇప్పుడు ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్ 19’ ఇంట్లో ప్రణీత్ కు డెంగ్యూ సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రణీత్ ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్యులు ప్రణీత్ కు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రణీత్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ప్రణీత్ మోర్ ‘బిగ్ బాస్ 19’ నుండి నిష్క్రమించడం అతని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రణీత్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ‘బిగ్ బాస్ 19’లోకి తిరిగి ప్రవేశిస్తాడో లేదో చూడాలి. ఇంట్లో వారం రోజులు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రణీత్‌కు మంచి మద్దతు లభించింది.

ఇవి కూడా చదవండి

ప్రణీత్ మోర్ గురించి చెప్పాలంటే, సోషల్ మీడియాలో అతను చాలా ఫేమస్. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా అతనికి పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతను స్టాండ్-అప్ కమెడియన్ కూడా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా