AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1 OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంతారా ఛాప్టర్ 1.. రిషభ్ శెట్టి 800 కోట్ల సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా ఛాప్టర్ 1 ఓటీటీ లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరెందుకు లేటు కాంతరా ఛాప్టర్ 1 సినిమాను చూసేయండి.

Kantara Chapter 1 OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంతారా ఛాప్టర్ 1.. రిషభ్ శెట్టి 800 కోట్ల సినిమా  ఎక్కడ చూడొచ్చంటే?
Kantara Chapter 1 Movie
Basha Shek
|

Updated on: Oct 31, 2025 | 6:45 AM

Share

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’.  దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్  బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు  రాబట్టింది.   రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1  సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో 800 కోట్లు సాధించిన ఛావా సినిమాను వెనక్కినెట్టింది. అది కూడా కేవలం మూడు వారాల్లోనే. కాగా కర్ణాటకలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కాంతార జోరు మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (అక్టోబర్ 31) అర్ధరాత్రి నుంచే కాంతరా ఛాప్టర్ 1 సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.  కన్నడతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను చూస్తోన్న ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

కాగా కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య,  తమిళ నటుడు జయరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ అందించిన పాటలు, బీజీఎమ్ కాంతార 1 సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా రిషభ్ శెట్టి నట విశ్వరూపం ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు ఎంచెక్కా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూసేయండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!