అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్
అల్లు వారబ్బాయి శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకైన శిరీష్.. తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థ వేడుక జరిగింది.
రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. వీరి నిశ్చితార్థ వేడుకల్లో అల్లు కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అల్లు శిరీష్. ఆయన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టింది. అక్టోబర్ 31న తమ సొంతింట్లో నిశ్చితార్థ వేడుక కోసం చేసుకున్న ఏర్పాట్లకు వరుణుడు ఆటంకం కలిగించాడని ఎంగేజ్మెంట్ డెకరేషన్ వర్క్స్ ఫోటోస్ షేర్ చేశారు. చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశానని… కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అంటూ శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలయ్యింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని తమ సొంతింట్లోనే శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ జరిగింది. తన లాస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవలే తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
8.20 శాతం వడ్డీతో నెలనెలా ఆదాయం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..
అమ్మతో ప్రతి క్షణం విలువైనదే.. ఆయుష్షును పెంచేదే
ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు
పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

