పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్
దూరపు కొండలు నునుపు అన్నట్లుగా చాలా మందికి ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే మక్కువ. మంచి జీతం, సౌకర్యాలకు కొదవే లేదు అనుకుంటారు. కానీ బెంగళూరులో తెలిసిందేంటంటే.. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య ఉద్యోగాల కొనసాగిస్తున్నారు. బిజీ జీవితం, పెరిగిన ఖర్చులు, ఈఎంఐలు, టార్గెట్ల బెడద ఎక్కువని వాపోతున్నారు.
పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం టెకీలు ఊహించని పనులు చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా, ట్యాక్సీ డ్రైవర్లు సేవలందిస్తూ రిలాక్స్ అవుతున్నట్లు తెలిపారు. పగలంతా ఉద్యోగంలో బిజీగా ఉండి, రాత్రి కాగానే కొత్త అవతారంలోకి మారుతున్నారు. మరికొందరు డబ్బు కోసమే చేస్తున్నట్లు తెలిపారు. సంపాదిస్తున్న డబ్బులు సరిపోవడం లేదా? లేదా ఊరికే టైంపాస్ కోసం ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బెంగళూరు రోజురోజుకి ఎంతో ఖరీదైన నగరంగా మారుతోంది. అందులోనూ ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, ఆహారం, సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ ప్రతి టెక్కీకి అందరూ అనుకున్నట్లుగా పెద్ద పెద్ద జీతాలు లభించడం లేదు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారికి 50 నుంచి రూ. 60 వేల వేతనం లభిస్తోంది. ఆ డబ్బు చాలక అదనపు మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు యువ ఇంజనీర్లు వారానికి రెండు రాత్రులు అయినా క్యాబ్ నడుపుతూ సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు టెక్కీలకు జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. ఉదయాన్నే లేవడం, రెడీ కావడం, ఆఫీసుకు వెళ్లడం, అక్కడ రోజంతా ఒత్తిడిలో కష్టపడడం, టార్గెట్లు, తిరిగి ఇంటికి రావడం, పడుకోవడం ఇలా ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడ్డారు. దీంతో జీవితంలో ఒంటరితనం పెరుగుతోంది. అలాగే మానసిక సమస్యలు, కోపం, ఉద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేందుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్లడం, నైట్ పార్టీలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఆశించిన మేర వారికి ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక మార్పు కోసం రాత్రి సమయాల్లో ఇతర వ్యాపకాలను అనుసరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే
జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..
ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్.. ఎందుకంటే ??
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

